Home /News /telangana /

THE CLASHES BETWEEN YS SHARMILA AND JAGAN REAL OR WRONG WHATS GOING ON IN TELANGANA VB

YS Sharmila: జగన్మోహన్ రెడ్డికి.. షర్మిలకు మధ్య గొడవలు నిజమేనా..! అసలేం జరుగుతోంది..

వైఎస్ షర్మిల (ఫైల్)

వైఎస్ షర్మిల (ఫైల్)

YS Sharmila-RK: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ నిర్వహించే 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. దానికి సంబంధించి ఒక ప్రోమో విడుదల చేశారు. వేమూరి రాధాకృష్ణ ఆమెను పలు ఆసక్తికరమైన ప్రశ్నలను సంధించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
  వైఎస్ షర్మిల(YS Sharmila).. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‍రెడ్డి(YSR) కుమార్తె. ఆమె మొదట 2012 నుంచి 2013 మధ్య కాలంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ (YSR Congress Party) పార్టీ తరఫున ప్రచారంలో భాగంగా తెలంగాణ(Telangana) వ్యాప్తంగా పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రకు "మరో ప్రజా ప్రస్థానం" అనే పేరు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఆమె అన్న జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచార బాధ్యతలను తను తీసుకుని ప్రజలకు మరింత చేరువయ్యారు. ఆ తరువాత మళ్లీ ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేశారు.

  Minister KTR: మరోసారి ట్విట్టర్ లో పొరపాటు పోస్టు చేసిన మంత్రి కేటీఆర్..! అదేంటంటే..


  నిరుద్యోగుల తరఫున పోరాడుతూ .. దీక్షలు కూడా చేపట్టారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఆమె విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక్కడ దొరల పాలను సాగుతుందని.. త్వరలోనే దానికి చరమగీతం పాడే రోజు వస్తుందని ఆమె సోషల్ మీడియాలో చాలా సార్లు చెప్పారు. అయితే ఇదిలా ఉండగా.. తాజాగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ నిర్వహించే 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దానికి సంబంధించి ఒక ప్రోమో విడుదల చేశారు. వేమూరి రాధాకృష్ణ ఆమెను పలు ఆసక్తికరమైన ప్రశ్నలను సంధించారు.

  ప్రస్తుతం ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలోనూ.. ప్రస్తుతం కూడా వైఎస్సార్ కుటుంబీలకు ఏబీఎన్ అంటే వ్యతిరేకం అనే భావన అటు వారి కుటుంబసభ్యులకు.. ఇటు అభిమానులకు కూడా ముద్ర పడిపోయింది. కానీ.. ఆమె ఇలా ఒక్కసారిగా ఓపెన్ హార్ట్ కు హాజరవడం ద్వారా ఆ ముద్రను చెరిపివేసే ప్రయత్నం చేశారా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేకపోతే ఆమె తెలంగాణలోని ఆమె పార్టీని మరింత బలం చేకూర్చే విధంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నారా అనే ఆసక్తి కలిగిస్తోంది. ఆర్కే ఎప్పట్లాగానే కొన్ని సీరియస్ ప్రశ్నలు, కొన్ని ఆహ్లాదకరమైన ప్రశ్నలు సంధించినట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది. ప్రోమోలో మొదట.. తమను షర్మిల అని సంబోధించాలా.. లేదా షమి అని అనాలా అంటూ అడగ్గా.. మీ ఇష్టం అంటూ సమాధానం చెబుతుంది షర్మిల.

  Huzurabad By Elections: టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ ఇదేనా.. అందుకే వాళ్లతో ఇలా చేస్తున్నారా..?


  ఇంట్లో వాళ్లందరి షమి అని పిలుస్తారు కదా.. తాను కూడా అలా పిలుస్తాను అంటూ అంటాడు. తెలంగాణలో నియంత పాలన సాగుతుందని.. అందుకే తెలంగాణలో పార్టీ పెట్టాల్సి వచ్చిందంటూ చెబుతుంది. తెలంగాణలో మరో బలమైన పార్టీ లేకపోవడంతో కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. అతడి పిలక కేసీఆర్ చేతిలో ఉందని.. ఏ సమయంలోనైనా.. కేసీఆర్ పిలకతో పాటు మెడ కూడా తీసేయగలరు.. అలాంటిది ఇక్కడ ప్రతిపక్షం ఎక్కడ ఉందంటూ పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ కు మీకు మధ్య విబేధాల కారణంగానే .. తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టారా అని అడగ్గా.. దానికి అదేం లేదంటూ సమాధానం చెప్పారు. బయట మాట్లాడకుంటున్న ప్రతీ విషయం నిజం కాకపోవచ్చు కదా.. అంటూ ఆమె తెలిపారు.

  రైల్వేస్టేషన్ వద్ద వారిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.. వారిని ప్రేమికులు అనుకున్నారు.. కానీ ఇంతలోనే..


  ఇక సజ్జల రామకృష్ణా రెడ్డి గురించి మాట్లాడుతూ.. అతడు మాట్లాడిన మాటలకు చాలా బాధ వేసిందని.. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం.. వారు అడిగిన ప్రతీ సారి తన శక్తికి మించి శ్రమించానని .. ఈ విషయం అందరికీ తెలుసు అని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రోమో మాత్రమే విడుదల అయింది. మొత్తం ఎపిసోడ్ ఆదివారం రాత్రి విడుదల కానుంది. అయితే ప్రస్తుతం విడుదల అయిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

  దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. నాకు తెలిసి ఇది మాములు ఇంటర్వ్యూ కాదు.. ఆర్కే ఎంతోమందిని ఇంటర్వ్యూ చేశారు కానీ ఇది రెండు రాష్ట్రాల ప్రజలు ఎవ్వరు ఊహించని కథ.. అంటూ ఒకరు కామెంట్ చేయగా.. అయినా అన్నతో గొడవ జరిగితే ఆంధ్రాలో పార్టీ పెట్టాలి కానీ.. తెలంగాణ లో పార్టీ పెట్టడం ఏంటి.. ఈ లాజిక్ ఏంటో అర్థం కావడం లేదంటూ మరొకరు కామెంట్ చేశారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Ap cm jagan, Politics, YS Sharmila

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు