Home /News /telangana /

THE CHILD OF A TRIBAL WOMAN WHO BORN ON THE ROAD LESS THAN THREE DAYS AGO DIED OF ILLNESS ADB PRV

Adilabad: అయ్యో.. మూడు రోజులకే శిశువు మృత్యువాత.. ఆదివాసీల పరిస్థితి ఇంతేనా?

రోడ్డుపై గర్భిణీ (ఫైల్​)

రోడ్డుపై గర్భిణీ (ఫైల్​)

మొన్నటికి మొన్న పురిటి నొప్పులతో ఆసుపత్రికి బయలు దేరిన గిరిజన మహిళ (Woman) వాగు దేటే క్రమంలో వాగు ఒడ్డునే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక నిన్నటికి నిన్న ఓ మహిళ రోడ్డు పైనే ప్రసవించింది. నేడు మరో దారుణం చోటుచేసుకుంది.

    (Lenin, News18, Adilabad)

    కొమురంభీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా బెజ్జూరు మండలంలోని నాగేపల్లిలో విషాదం నెలకొంది. మూడు రోజుల క్రితం నడిరోడ్డుపైన ప్రసవించిన మగ శిశువు వైద్యం అందక మృతి చెందాడు. మూడు రోజులకే ఆ మగ శిశువుకు (Baby died) నూరేళ్ళు నిండాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన కొడిపె మల్లుబాయికి మూడు రోజుల క్రితం పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. అయితే కుశ్నపల్లి వాగు వద్ద వరద కారణంగా 108 వాహనం మొగవెల్లి గ్రామానికి చేరుకునే పరిస్థితి లేకపోయింది. మరో దారిలో కూడా చేరుకునే ప్రయత్నం చేసినప్పటికి కోయపల్లి సమీపంలోని వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది. ఈ దారిలో కూడా అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోయింది.

    దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో వంతెన వరకు తీసుకువెళ్ళారు. వంతెన వద్ద రోడ్డు కోతకు గురికావడంతో ముందుకు వెళ్ళలేకపోయారు. అక్కడె నిలిచిపోవడంతో 108 సిబ్బంది కాలినడక వెళ్ళి అక్కడే వైద్యం అందించడంతో మల్లుబాయి మగశిశువుకు జన్మనిచ్చింది. కాగా ఇంటి వద్ద ఉండగా శిశువు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, ఆసుపత్రికి వెళ్దామంటే వాహన సదుపాయం లేకపోవడంతో ఇంట్లోనే అయోమయ పరిస్థితిలో ఉన్న సమయంలోనే మూడు రోజుల బాబు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.



    తప్పని వెతలు..

    తన కడుపులో నవ మాసాలు పెరిగిన శిశువు ఈ భూమి మీదకు రావాలంటే గిరిజన మహిళల పాలిట ఓ గండంగానే పరిణించింది. పురిటి నొప్పులను సైతం పంటి బిగువున భరించినప్పటికి ప్రసవ వేదన మాత్రం వారికి తీవ్ర భారంగా మారుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని మారుమూల గిరిజన గూడాలకు చెందిన ఆదివాసి మహిళలకు ఏళ్లు గడుస్తున్న ప్రసవ వేదన తప్పడం లేదు. ప్రసవ సమయానికి ముందే మహిళలను గుర్తించి సమీపంలోని ఆసుపత్రులకు చేరవేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నప్పటికి ఈ వర్షా కాలంలో మారుమూల గిరిజన మహిళలకు (Tribes Women) ప్రసవ సమయంలో వేదన తప్పడం లేదు. వర్షాలు (Rains), వరదల (Floods) కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆసుపత్రులకు వెళ్ళెందుకు తిప్పలు తప్పడం లేదు. గూడాలకు సరైన రవాణ సౌకర్యం లేక, అంబులెన్స్ సహా ఇతర వాహనాలు వచ్చే పరిస్థితి లేక (No Proper Transport facility) పురిటి నొప్పులతో బయలుదేరిన మహిళలు మార్గం మధ్యలోనే ప్రసవించిన ఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పునరావృతమవుతున్నాయి. మొన్నటికి మొన్న పురిటి నొప్పులతో ఆసుపత్రికి బయలు దేరిన గిరిజన మహిళ (Woman) వాగు దేటే క్రమంలో వాగు ఒడ్డునే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక నిన్నటికి నిన్న ఓ మహిళ రోడ్డు పైనే ప్రసవించింది.

    వాగు ఒడ్డునే..

    ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ(జి) గ్రామానికి చెందిన గర్భిణి ఉయిక గాంధారి వాగు దగ్గర ప్రసవించింది. ఉదయం ఆమె పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అప్రమత్తమై.. ఆమెను ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మామిడిగూడ వాగు ఉద్ధృతి పెరిగింది. వాగు దాటేందుకు ఇబ్బంది ఎదురైంది. నొప్పులు తీవ్రం కావడంతో గర్భిణి ఆ వాగు ఒడ్డునే ప్రసవించింది. విషయం తెలుసుకున్న పిట్టబొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వాగు దాటి వెళ్ళి అక్కడే ప్రథమ చికిత్స అందించారు.

    అనంతరం గ్రామస్థుల సహాయంతో ఆ బాలింతను, పసిబిడ్డను అతికష్టం మీదా వాగు దాటించారు. వాగు దాటాక అక్కడ నుండి బురదమయమైన రోడ్డు ఉండటంతో అంబులెన్స్ రాలేని పరిస్థితి.. దీంతో వాగు వద్ద నుండి ఒకటిన్నర కిలోమీటర్ మేర నడిపించుకుంటూ మామిడిగూడ(ఎ) గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఐటిడిఎ - అవ్వల్ అంబులెన్స్ లో ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు ఆ తల్లి బిడ్డలకు వైద్యమందించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Died, Tribes

    తదుపరి వార్తలు