హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ideal Village: గ్రామపంచాయితీలకు బంఫర్​ ఆఫర్​..  అలా చేస్తే కోటి రూపాయల నజరానా.. 

Ideal Village: గ్రామపంచాయితీలకు బంఫర్​ ఆఫర్​..  అలా చేస్తే కోటి రూపాయల నజరానా.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తమ గ్రామం. కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా దేశంలోని ఆదర్శ గ్రామాలను ఎంపిక చేస్తోంది. ఆయా గ్రామాలకు ప్రోత్సాహకాలు సైతం అందిస్తోంది. అయితే తాజాగా ఆ ప్రోత్సాహకాలను రూ. కోటికి పెంచింది.

  ఉత్తమ గ్రామం (Ideal village) . కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా దేశంలోని ఆదర్శ గ్రామాలను ఎంపిక చేస్తోంది. ఆయా గ్రామాలకు ప్రోత్సాహకాలు సైతం అందిస్తోంది. అయితే తాజాగా ఆ ప్రోత్సాహకాలను రూ. కోటికి పెంచింది. అయితే ఉత్తమ గ్రామ పంచాయతీల (Ideal village) ఎంపికకు అనుసరించే మార్గదర్శకాలలో కేంద్రం మార్పులు చేసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) అంశాల ఆధారంగా ఉత్తమ గ్రామాలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. మొదటి బహుమతికి కోటి , రెండో బహుమతికి రూ.75లక్షలు, మూడో బహుమతి పొందిన గ్రామానికి రూ.50లక్షల వరకు అవార్డు ఇస్తారు.

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని ఎంపిక చేస్తారు. అయితే జాతీయ స్థాయిలో మాత్రమే ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామాల ఎంపికను తొలగించారు. ఎస్డీజీలోని 9 అంశాలపై గ్రామాలను ఎంపిక చేస్తారు. ఒక అంశానికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందిస్తారు. 1) పేదరికం లేని, మెరుగైన జీవనోపాధి ఉన్న గ్రామం 2) బాలలకు అనుకూలమైన గ్రామం 3) అభివృద్ధికి నాంది 4) సుపరిపాలన 5) ఆరోగ్యం 6) స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాలు 7) సామాజిక భద్రత 8) పచ్చదనం, పరిశుభ్రత 9) సమృద్ధిగా నీరు అంశాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు.

  కరీంనగర్​లో ఎస్​ఏజీవైలో మూడు గ్రామాలు..

  కరీనంగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామం సంసద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్.ఎ.జి.వై) లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కాగా ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న వేలాది గ్రామాలతో అభివృద్దిలో పోటిపడి వెన్నంపల్లి గ్రామం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి కరీంనగర్ జిల్లా కీర్తి  పతాకాన్ని నలుదిశల చాటింది. దేశవ్యాప్తంగా సంసద్ ఆదర్శ యోజన పథకం క్రింద 248 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేశారు. ఇందులో తొలి పదకొండు గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవే, అందులో 3 గ్రామాలు కరీంనగర్ జిల్లాలోనివి కావడం విశేషం.

  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పలు గ్రామాలు సంసద్ ఆదర్శ గ్రామాలుగా ఎంపిక కావడానికి ఎంతో దోహదపడింది. పల్లె ప్రగతి కార్యకమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని 313 గ్రామ పచాయితీలకు 313 ట్రాక్టర్లు, ట్రైలర్లు, ట్యాంకర్లు కొనుగోలు చేశారు. అలాగే 310 గ్రామపంచాయతీలలో వైకుంఠధామాలు, 313 గ్రామాలలో నర్సరీలు, కంపోస్టు షెడ్లు నిర్మించారు. 402 పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీల లో ప్రతిరోజు పకడ్భందిగా పారిశుద్ద్య పనులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ప్రతి ఇంటినుండి తడి పొడి చెత్తను సేకరించేందుకు ట్రైసైకిళ్లు, ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. సెగ్రిగేషన్ షెడ్ల ద్వారా కంపోస్టు ఎరువులు తయారు చేస్తున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Best, Ideal village

  ఉత్తమ కథలు