హోమ్ /వార్తలు /తెలంగాణ /

Electricity purchase: విద్యుత్​ కొనుగోలుపై తెలంగాణకు కేంద్రం గుడ్​న్యూస్​.. వివరాలివే..

Electricity purchase: విద్యుత్​ కొనుగోలుపై తెలంగాణకు కేంద్రం గుడ్​న్యూస్​.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రాల విద్యుత్‌ బకాయిలు, కొనుగోళ్లపై (Electricity purchase) నిషేధం అంశంలో కేంద్ర ప్రభుత్వం యూ టర్న్​ తీసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రాష్ట్రాల విద్యుత్‌ బకాయిలు, కొనుగోళ్లపై (Electricity purchase) నిషేధం అంశంలో కేంద్ర ప్రభుత్వం యూ టర్న్​ తీసుకుంది. నిర్దేశిత గడువు ముగిసినా.. విద్యుదుత్పత్తి కంపెనీలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు బకాయిలు చెల్లించలేదన్న ప్రకటనను వెనక్కి తీసుకుంది. గడువులోగానే చెల్లింపులు చేశామన్న తెలంగాణ (Telangana) వాదనను అంగీకరించింది. ఎనర్జీ ఎక్సే్ఛంజీల ద్వారా విద్యుత్‌ క్రయవిక్రయాలు జరపకుండా రాష్ట్ర డిస్కంలపై విధించిన నిషేధాన్ని శనివారం ఎత్తివేసింది. కేంద్రం నిషేధాన్ని సడలించిందని, ఎనర్జీ ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్‌ కొనుగోళ్లను పునః ప్రారంభించామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోల సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

విద్యుదుత్పత్తి సంస్థలకు (Power Generation Companies) బకాయిలు చెల్లించలేదన్న కారణంతో.. ఇంధన ఎక్స్‌చేంజిలో తెలంగాణ (Telangana) సహా పలు రాష్ట్రాల విద్యుత్ అమ్మకాలు, కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. కేంద్ర వెల్లడించిన లెక్కల్లో అన్ని తప్పులే ఉన్నాయని పలు రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో బకాయిల లెక్కల సరిచూసిన కేంద్రం.. తప్పులను సవరించింది. ఏపీ సహా ఆరు రాష్ట్రాలు సమర్పించిన లెక్కలు సరిచూశాక వాటిపై నిషేధాన్ని తొలగించింది. ఐతే తెలంగాణ మాత్రం బకాయి ఉందని నిషేధాన్ని కొనసాగిస్తోంది. తెలంగాణ డిస్కంలు ఆగస్టు 18 నాటికి బకాయిలపై 'ఆలస్య రుసుం సర్ఛార్జి' (LPS) రూ.52.85 కోట్లు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ సొమ్మును చెల్లిస్తేనే విద్యుత్ కొనేందుకు అనుమతిస్తామని తెలిపింది. తిరిగి పరిశీలన జరిపిన కేంద్రం రాష్ట్ర బకాయిలు రూ.7 కోట్లేనని సరిదిద్దుకుంది. ఈ బకాయిని రాష్ట్ర డిస్కంలు వెంటనే చెల్లించేయడంతో నిషేధాన్ని సడలించింది.

విద్యుత్‌ శాఖ కొత్తగా లేట్‌ పేమెంట్‌ సర్చార్జీ రూల్స్‌–2022  అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం డిస్కంలు విద్యుదుత్పత్తి కంపెనీలకు 45 రోజుల గడువులోగా బిల్లులు చెల్లించాలి. ఆ గడువు దాటి మరో నెల గడిచినా చెల్లించకుంటే.. ఆ తర్వాతి రోజును ‘డిఫాల్ట్‌ ట్రిగ్గర్‌ డేట్‌’గా పరిగణిస్తారు. అంటే ఆ రోజు నుంచి 75 రోజుల్లోగా బకాయిలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొనుగోళ్లు జరపకుండా సదరు డిస్కంలను కట్టడి చేసే నిబంధనను కేంద్రం తెచ్చింది. ఈ అధికారాన్ని జాతీయ గ్రిడ్‌ నిర్వహణను పర్యవేక్షించే ‘పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ (పోసోకో)’కు కట్టబెట్టింది.

అయితే ఈ నిబంధనలనే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా తమ నిరసన తెలియజేసింది. కేవలం ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలకు ప్రయోజనం కల్పించడానికే కేంద్రం ఈ నిబంధనలు తెచ్చిందని ఆరోపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఎట్టకేలకు కేంద్ర కూడా యూ టర్న్​ తీసుకోవడంతో రాష్ట్ర ప్రజలకు కరెంట్​ కష్టాలు తీరనున్నాయి.

First published:

Tags: ELectricity, Power problems

ఉత్తమ కథలు