Home /News /telangana /

THE CENTRAL GOVERNMENT HAS ORDERED THE TELANGANA GOVERNMENT TO CONDUCT AN INQUIRY INTO THE IRREGULARITIES IN THE EMPLOYMENT GUARANTEE SCHEME PRV

MGNREGA: తెలంగాణ ఉపాధి హామీ కూలీలకు షాక్​.. అక్రమాలు జరిగాయంటూ పనులపై విచారణకు కేంద్రం ఆదేశాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉపాధి హామీ పథకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ పథకం కొత్త చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకుంటే తెలంగాణలో నిబంధనల మేరకు పనులు జరగడం లేదట.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఉపాధి హామీ పథకం (MGNREGA).. 1991లో ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గట్టెక్కించిన మాజీ ప్రధానమంత్రి వీపీ నరసింహారావు ప్రభుత్వం ఈ పథకాన్ని తొలిసారి ప్రతిపాదించింది. అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్.. ప్రధానిగా మారాక.. 2008లో యూపీఏ (UPA)ప్రభుత్వ హయాంలో చట్టంగా చేశారు. ఇది ఎంత గొప్ప చట్టం అంటే.. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద ఉపాధి హామీ పథకంగా (Employment guarantee scheme) గుర్తింపు పొందింది. అతిపెద్ద, ప్రతిష్టాత్మకమైన సామాజిక భద్రత, ప్రజా పనుల కార్యక్రమంగా దీనికి గుర్తింపు వచ్చింది. గ్రామీణ అభివృద్ధికి ఈ పథకం వెన్నుదన్నుగా నిలుస్తుందనే ప్రశంసలు దక్కాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో.. కనీసం 100 రోజులపాటూ.. పేదవారికి, గ్రామాల్లో వారికి ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే ఇపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ పథకం కొత్త చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకుంటే తెలంగాణలో (Telangana) నిబంధనల మేరకు పనులు జరగడం లేదట. ఈ విషయాన్ని కేంద్ర ప్రతినిధి బృందం తెలిపింది.

    జూన్​ 9 నుంచి 12 వ తేదీల మధ్య..

    తెలంగాణలో ఉపాధి హామీ పథకం (MNGR Employment guarantee scheme) తీరు తెన్నులు తెలుసుకునేందుకు జూన్​ 9 నుంచి 12 వ తేదీల మధ్య కేంద్ర బృందం పర్యటించింది. దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి (Central government) సమర్పించింది. చాలా అక్రమాలు జరిగాయని ఆ నివేదిక తెలిపింది. దీంతో నివేదికలో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఓ లేఖ (Letter) రాసింది.



    అధికారులపై తక్షణ చర్యలు..

    నివేదిక ప్రకారం రాష్ట్రానికి పంపిన లేఖలో..  తెలంగాణలో ప్రతీ చెరువులో ఏటా పూడిక తీస్తున్నారని, పని జరగక ముందు ఎలా ఉండేది? జరిగిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది? అనే లెక్కలు వేయడం లేదని, దాంతో చెరువుల్లో జరిగే పూడిక పనులు అవినీతిగా భావిస్తున్నామని కమిటీ పేర్కొంది. ఈ పనులకు సంబంధించి ఆడిటింగ్‌, విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై తక్షణ చర్యలు చేపట్టి పూర్తి నివేదికను సమర్పించాలని రాష్ట్రాన్ని కోరింది కేంద్రం. పక్కదారి పట్టిన నిధులను వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం (Central government) రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది.

    ఇక ఏదైనా పెద్ద పని ఉంటే అది ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని.. అయితే కొందరు తెలివిగా ఆ పనిని విభజించి.. కిందిస్థాయి సిబ్బందితో అనుమతులు తెప్పించుకుని ఉపాధి హామీ పథకంలో చేశారని కమిటీ గుర్తించింది. వర్క్‌ ఆర్డర్లు ఇవ్వకుండా పనులు చేయించారని, ఉపాధి హామీ చట్టం నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ల ద్వారా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారని కమిటీ గుర్తించింది. కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టిన పనుల నిధులను వెనక్కి రాబట్టాలని ఆదేశించింది. గ్రామాల్లో కల్లాల ఏర్పాటు, మొక్కలకు ట్రీ గార్డుల ఏర్పాటు ఉపాధి హామీ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ఎవరి అనుమతితో ఈ పనులు చేపట్టారో చెప్పాలని నిలదీసింది. ఆ పనులకు ఖర్చు చేసిన మొత్తాన్ని అధికారుల నుంచి తీయాలని ఆదేశించింది.

    అనవసరమైన ప్రదేశాల్లో పనులు..

    ఇక అవసరమైన ప్రదేశాల్లో పనులు చేయకుండా అనవసరమైన ప్రదేశాల్లో పనులు చేశారని.. ఉదాహరణకు ఎత్తైన ప్రాంతాల్లో కాకుండా బాగా చదునుగా ఉన్న స్థలంలో ఉపాధి హామీ పథకాన్ని చేపట్టారని ఆరోపించింది కమిటీ. సీసీరోడ్లు, రోడ్డు పక్కన నాటిన మొక్కలు, వైకుంఠ ధామాలు, హార్టికల్చర్‌ ప్లాంటేషన్లు, చెరువుల పూడికతీత, నర్సరీలు, కంపోస్టు తయారీ, పంచాయతీ భవనాల నిర్మాణాలు, ధాన్యం ఆరబోసే కల్లాల నిర్మాణాలు తదితర పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టినట్లు గుర్తించారు. వీటిలో చాలావరకు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినట్లు తేల్చింది. ఆ మేరకు నివేదిక ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం నిధుల రికవరీకి ఆదేశించింది. కాగా, ఇప్పటికే మంత్రి హరీశ్​ రావు ఉపాధి హామీ విషయంలో కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Central Government, Telangana, Telangana Government

    తదుపరి వార్తలు