Home /News /telangana /

THE CENTRAL ELECTION COMMISSION HAS ORDERED THE BJP NOT TO USE CM KCR PHOTO ON THE SALU DORA SELAVU DORA CAMPAIGN PRV

KCR | Election Commission: కేసీఆర్​పై కమలం పోరు.. బీజేపీకి ఎన్నికల సంఘం​ బిగ్​ షాక్​.. 

బండి సంజయ్​, కేసీఆర్​ (ఫైల్​)

బండి సంజయ్​, కేసీఆర్​ (ఫైల్​)

తెలంగాణ బీజేపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌పై ప్రచారాన్ని నిలుపుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  తెలంగాణలో టీఆర్ఎస్‌ (Telangana Rastra Samithi) కు తిరుగులేదు. కారు జోరుకు ఎదురు లేదు. ఇది మొన్నటి మాట. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. గులాబీ పార్టీ తిరుగులేని శక్తగా ఎదుగుతున్న సమయంలో బీజేపీ (BJP) రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. దీనిబట్టి తెలంగాణలో బీజేపీ పార్టీ పుంజుకుంటోందని స్పష్టంగా అర్ధమవుతోంది. ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు కూడా బీజేపీ బలం పెరగడానికి కారణాలయ్యాయి. కరీంనగర్​లో బండి సంజయ్​ అరెస్టు, ధాన్యం కొనుగోళ్లు, ఇటీవల చోటుచేసుకున్న అత్యాచారాలపై పోలీసుల వైఖరిపై బీజేపీ నిలదీతలు కమలం పార్టీ ఛరిష్మాను తెలియజేశాయి. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ పని అయిపోయిందంటూ బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగానే కొద్దిరోజుల కిందట తెలంగాణ (Telangana)లో బీజేపీ వినూత్న రాజకీయ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. TRS ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఇంకా మరో 529 రోజులే ఉన్నాయంటూ గంటలు, నిమిషాలు, సెకన్లను కౌంట్‌డౌన్‌గా చూపుతూ selavudora అనే ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్​సైట్​లో (Selavudora.com) అందరూ రిజిస్ట్రేషన్​ చేసుకోవల్సిందిగా బీజేపీ అప్పట్లో సూచించింది.

  ‘‘సాలు దొర–సెలవు దొర’... కల్వకుంట్ల కౌంట్‌డౌన్‌’ (Saaludora selavudora Kalvakunta countdown) అంటూ డిజిటల్‌ గడియారం Live Display నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం గేటు పక్కన కొద్దిరోజుల కిందట ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్‌పై ‘సాలు దొర, సెలవు దొర’అనే నినాదాలతో సీఎం కేసీఆర్‌ ఫొటోలను ప్రదర్శిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) దీనిపై బీజేపీ (BJP)కి బిగ్​ షాక్​ ఇచ్చింది.

  బీజేపీ చేపట్టిన ‘‘సాలు దొర - సెలవు దొర’’ ప్రచారంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.  కాగా, ‘‘సాలు దొర - సెలవు దొర’’ప్రచారానికి అనుమతి కోరుతూ బీజేపీ నేతలే ఎన్నికల సంఘాన్ని సంప్రందించారు. దీనిని పరిశీలించిన ఎన్నికల సంఘం.. బీజేపీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌కు (CM KCR) వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని బీజేపీని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది. సీఎం బొమ్మతో బీజేపీ పోస్టర్లు ముద్రించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచేవిధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండకూడదని పేర్కొంది.

  సాలు మోదీ..సంపకు మోదీ..!

  సాలు దొరా.. ఇక సెలవు దొరా! అంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా జూన్ 24 నుంచి తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా వింగ్.. స్పెషల్ క్యాంపెయిన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. దీనికి కౌంటర్ ఇస్తూ.. ఓ భారీ ఫ్లెక్సీ సికింద్రాబాద్ టివోలీ చౌరస్తాలో కనిపించింది. ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటుచేశారనేది క్లారిటీ లేనప్పటికీ.. సాలు మోదీ.. సంపకు మోదీ అంటూ దానిపై రాసి ఉంది. రైతు చట్టాలతో రైతులను, పన్నులతో సామాన్యులను, వ్యాపారులను, అగ్నిపథ్ తో యువతను మోదీ పెట్టారని.. ఇక చాలని బైబై మోదీ ByeBye Modi అని స్లోగన్స్ దానిపై ఉన్నాయి.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Election Commission of India, Telangana bjp, Trs

  తదుపరి వార్తలు