Wedding: ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.. అర్థరాత్రి అతడితో పారిపోయేందుకు సిద్ధమైన వధువు.. ఏం జరిగింది..

ప్రతీకాత్మక చిత్రం

Wedding: మూడేళ్ల గా ఆ యువతి ఒకరిని ప్రేమించింది. తర్వాత పెద్దలు కుదించిన పెళ్లికి సిద్ధపడింది. అయితే ఉదయం పెళ్లి చేసుకుని అర్ధరాత్రి ప్రియుడితో వెళ్లిపోవాలని భావించింది. పెళ్లి పీటలపై నుంచి కూడా ప్రియుడితో చాటింగ్ చేసింది. తర్వాత ఏం జరిగిందంటే..

  • Share this:
    (సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

    మూడేళ్ల గా ఆ యువతి ఒకరిని ప్రేమించింది. తర్వాత పెద్దలు కుదించిన పెళ్లికి సిద్ధపడింది. అయితే ఉదయం పెళ్లి చేసుకుని అర్ధరాత్రి ప్రియుడితో వెళ్లిపోవాలని భావించింది. పెళ్లి పీటలపై నుంచి కూడా ప్రియుడితో చాటింగ్ చేసింది. అనుమానం వచ్చి బంధువులు నిలదీయడంతో విషయం పోలీస్ స్టేషన్ కు చేరింది. బంధువులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతానికి చెందిన బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న యువతికి మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్న చింతకుంట మండలం లో ఓ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం తలంబ్రాలు ఉండడంతో వధువు ఆమె తరపు బంధువులు శనివారమే సాయంత్రం వరుడి గ్రామానికి వచ్చారు. ఆదివారం ఉదయం పెళ్లి పీటల పై ఉన్న వధువు తరచూ సెల్ ఫోన్ లో లో చాటింగ్ చేస్తుండడంతో ఎవరితోనో మాట్లాడడం బంధువులు కొందరు గుర్తించారు. తలంబ్రాలు అనంతరం పెళ్లి పందిరి లోనే అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని పక్కకు తీసుకెళ్లి నిలదీసి దేహశుద్ధి చేయడంతో అసలు విషయం చెప్పాడు.

    తాను ఆమె మూడేళ్లుగా ప్రేమించుకున్నామని తెలిపాడు. వారిద్దరు కలిసి ఫోన్ లో దిగిన ఫోటోలు చూసి బంధువులు అవాక్కయ్యారు. దీంతో వధువు యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వధువు తన స్వగ్రామానికి చెందిన యువకుడిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పారు. పెళ్లి తర్వాత రాత్రికి పారిపోవాలని నిర్ణయించుకున్నట్లు అంగీకరించారు. ఆ యువకుడు కూడా శనివారమే పెళ్లి కూతురు వాహనం వెనుక ద్విచక్ర వాహనం లో వెంబడిస్తూ వచ్చినట్లు చెప్పాడు.

    రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలతో పోలీసులు విచారణ చేశారు. అయితే ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్ ఐ భాగ్య లక్ష్మి రెడ్డి తెలిపారు. ఇరువర్గాల అంగీకారం మేరకు వధూవరులను ఎవరి ఇంటికి వారిని పంపించామని యువకుడిని కూడా వదిలేసినట్లు ఎస్ఐ తెలిపారు.
    Published by:Veera Babu
    First published: