Mini Muncipal: బీజేపీకి ఘోర పరాభవం.. ఈ మున్సిపాలిటీల్లో మరీ ఒక్కొక్క సీటే..

ప్రతీకాత్మక చిత్రం

Mini Muncipal: రెండు నగరపాలిక, ఐదు మున్సిపాలిటీ లకు జరిగిన ఎన్నికలో బీజేపీ హవా ఎక్కడా కనిపించలేదు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలో ఇంత వరకు బీజేపీ ఖాతా తెరవకపోగా.. ఖమ్మంలో ఒక్క స్థానాన్ని నిలబెట్టుకుంది. నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలో బీజేపీ చతికిలపడగా.. సిద్దిపేట, జడ్చర్లలో ఒక్కో వార్డు చొప్పున గెలుచుకున్నారు. జడ్చర్లలో మాత్రమే రెండు స్థానాలను గెలుచుకుంది.

  • Share this:
    దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలవగా వెంటనే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను చాటింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాష్ర్టంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ నిలుస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ తదుపరి వచ్చిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో మూడో స్థానంలో నిలిచింది. దీంతో బీజేపీ కార్యకర్తలో నిరుత్సాహం కనిపించింది. దుబ్బాక, జీహెచ్ ఎంసీ వేవ్ ఇక్కడ కనిపించకపోవడానికి గల కారణాలను వారు చెప్పలేకపోయారు. దబ్బాక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తగిలిన దెబ్బతో టీఆర్ఎస్ అలర్ట్ అయినట్లు కనిపించింది. అప్పటి నుంచి ప్రతీ అంశాన్ని లోతుగా విశ్లేషిస్తూ అడుగులేసింది. అందుకే సాగర్ బై ఎలక్షన్ లో ప్రత్యర్థి రాజకీయలో బాగా అనుభవం ఉన్న అభ్యర్థి జానారెడ్డిపై సులువుగా విజయం సాధించింది. ఇదిలా ఉండగా మినీ మున్సిపల్ పోరులో కూడా బీజేపీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో ఖమ్మంలో కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలవగా వరంగల్ లో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఒక్క స్థానంలో కూడా బీజేపీ తన పట్టును నిలుపుకోలేక పోయింది.

    ఐదు చోట్ల జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లలో కూడా అదే పరిస్థతి నెలకొంది. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డుల‌కు గానూ, టీఆర్ఎస్ పార్టీ 36 వార్డుల్లో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఒక వార్డులో మాత్రమే బీజేపీ గెలుపొందింది. అచ్చంపేట మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టీఆర్ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో మాత్రమే బీజేపీ గెలుపొందింది. జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 27 వార్డుల‌లో ఇందులో టీఆర్‌ఎస్ 23 వార్డుల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ రెండు, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి.

    రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీ కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డుల‌కుగాను 7 వార్డుల‌ను కైవ‌సం చేసుకుని గులాబీ జెండాను ఎగుర‌వేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలుపొందగా బీజేపీ మాత్రం ఖాతా తెరవలేదు. న‌కిరేక‌ల్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డుల‌కు గాను 11 వార్డుల‌ను టీఆర్ఎస్ కైవ‌సం చేసుకోగా అక్కడ కూడా బీజేపీ ఖాతా తెరవలేదు.
    Published by:Veera Babu
    First published: