Home /News /telangana /

THE BASARA IIIT COLLEGE MANAGEMENT TOOK MONEY FOR INSURANCE FROM THE STUDENTS FOR A FEW YEARS AND DID NOT APPLY PRV

Basara IIIT: బాసర ట్రిపుల్​ఐటీలో కుంభకోణం.. విద్యార్థి మృతితో వెలుగులోకి ఘటన..

(ఫైల్‌ ఫోటో)

(ఫైల్‌ ఫోటో)

గత కొద్దిరోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ పేరు మారుమోగుతోంది. తమకు కనీస సౌకర్యాలు కల్పించాలంటూ విద్యార్థులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అదే ట్రిపుల్​ ఐటీలో ఓ షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Adilabad | Nizamabad
    నిర్మల్ (Nirmal)జిల్లా బాసర (Basara)లోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ట్రిబుల్ ఐటీ (RGUKT IIIT)కాలేజీలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ట్రిపుల్ ఐటీ (Basara IIIT)లో ఇన్సూరెన్స్ వివాదం దుమారం లేపుతుంది. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్న వరంగల్ విద్యార్థి మరణించగా, అతనికి ఇన్సూరెన్స్ (Insurance) లేదని తేలింది. కాలేజీలో మాత్రం ఇన్సూరెన్స్ చేయిస్తామని చెప్పి విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేశారని, తీరా ఒక విద్యార్థి చనిపోతే కానీ ఇన్సూరెన్స్ చేయలేదన్న విషయం తెలియలేదు అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  అయితే విద్యార్థులు మాత్రం తాము 700 రూపాయలు ఇన్సూరెన్స్ కోసం చెల్లించామంటూ వాపోతున్నారు.

    ఇలా చూస్తే ప్రతి సంవత్సరం విద్యార్థుల నుండి డబ్బులు తీసుకుని ఇన్సూరెన్స్ చేయక ఎన్ని లక్షల స్కామ్ జరిగిందోనని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ విషయమై బాసర ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్స్లర్ వెంకటరమణను వివరణ కోరగా.. నేను బాధ్యతలు చేపట్టి 16 రోజులు అయిందని పూర్తి విషయాలు తెలుసుకుంటున్నానని తెలిపారు.



    తల్లిదండ్రులకు సున్నితంగా చెప్పే ప్రయత్నం..

    కొద్దిరోజులుగా బాసర ఐఐఐటీ అట్టుడుకుతోంది. సమస్యలు పరిష్కారం కొరకు స్టూడెంట్స్‌ పెట్టిన డెడ్‌లైన్ పూర్తి కావడంతో ట్రిపుల్‌ ఐటీ కాలేజీ అడ్మినిస్ట్రేటర్స్ కొద్దిరోజుల కిందటే స్టూడెంట్స్‌(Students) పేరెంట్స్‌తో చర్చలు జరిపింది. సమస్యను వెంటనే పరిష్కరించడం సాధ్యం కాదనే విషయాన్ని విద్యార్ధుల తల్లిదండ్రులకు సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్ధులు మాత్రం ఈవిషయంలో ఈసారి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. కాలేజీకి సెలవులు ఉండటంతో ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించారు.

    బాసర ట్రిపుల్‌ ఐటీ స్టూడెంట్స్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికి ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. మధ్యలో ఫుడ్ పాయిజన్‌ కావడం వల్లే వంద మంది విద్యార్ధులు ఆసుపత్రి పాలయ్యారు. రెగ్యులర్ వీసీని నియమించాలంటే ..ఇన్‌చార్జ్‌ వీసీని నియమించడంతో స్టూడెంట్స్‌ గుర్రుగా ఉన్నారు. నాలుగు ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తామని ఇన్‌చార్జ్‌ వీసీ లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీ కూడా నెరవేర్చకపోవడంతో స్టూడెంట్స్‌ తమ ఉద్యమ పంథాను మార్చుకున్నారు. అంతే కాదు ఆదివారం నుంచి ఈనెల 31వ తేది వరకు ట్రిపుల్‌ ఐటీకి సెలవులు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉద్యమాన్ని నీరుగార్చడానికే ఈవిధంగా సెలవులు ప్రకటించారని అంటున్నారు.

    తాత్కాలికంగా వాయిదా..

    తమ సమస్యలపై ఏకంగా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని చూస్తున్నారు బాసర ట్రిపుల్‌ ఐటీ స్టూడెంట్స్. తమ సమస్యలు పరిష్కరించాలంటూ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో వాతావరణం సహాకరించకపోవడం, భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో తమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లుగా ఎసీసీ కమిటీ పేర్కొంది. వర్షాలు తగ్గిన తర్వాత ఆందోళన తేదీని ప్రకటిస్తామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరోవైపు విద్యార్థుల సెల్ ఫోన్ల వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ఇంచార్జ్ వీసీ సర్క్యులర్ జారీ చేశారు. ఇకపై క్లాస్ రూమ్స్, ల్యాబ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద విద్యార్థులు సెల్ఫోన్ వాడొద్దని స్పష్టం చేశారు. విద్యార్థి ఉద్యమాన్ని, డిమాండ్లను అధికారులు కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని స్టూడెంట్ గవర్నెన్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Basara IIIT, Insurance, Nizamabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు