Cheating: ఇక్కడ కనిపిస్తున్న ఆ నలుగురు అమాయకులను ఎలా మోసం చేశారో తెలుసా..

పోలీసులు అదుపులో నిందితులు

Cheating: వాళ్లంతా బ్యాంకులో ఉన్నత ఉద్యోగులు. ఖాతాదారుల సొమ్ముకు భరోసా ఇస్తూ వారికి అవసరమైనప్పుడు డబ్బు తిరిగివ్వాల్సిన బాధ్యత ఉన్న వాళ్లు. కానీ ఏంచేశారో తెలుసా. తమ పొజిషన్లను దుర్వినియోగం చేస్తూ అమాయక గిరిజనం ఖాతాల్లోని సొమ్మును డ్రా చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 • Share this:
  (G. Srinivasa Reddy, News18, Khammam)

  వాళ్లంతా బ్యాంకులో ఉన్నత ఉద్యోగులు. ఖాతాదారుల సొమ్ముకు భరోసా ఇస్తూ వారికి అవసరమైనప్పుడు డబ్బు తిరిగివ్వాల్సిన బాధ్యత ఉన్న వాళ్లు. కానీ ఏంచేశారో తెలుసా. తమ పొజిషన్లను దుర్వినియోగం చేస్తూ అమాయక గిరిజనం ఖాతాల్లోని సొమ్మును డ్రా చేసుకున్నారు. ఇలా ఎంత అంటే సుమారుగా ముచ్చటగా మూడు కోట్లు. ఒక రోజు కాదు. రెండు రోజులు కాదు. ఏడాదిగా సాగుతున్న ఈ తతంగం అంతా ఇంటి దొంగల పనేనని పోలీసులు తేల్చారు. ఎట్టకేలకు భారీ సొమ్ముతో ఉడాయించిన మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, క్యాషియర్‌, అటెండర్లను అరెస్టు చేశారు.

  Hyderabad Crime: భార్య చనిపోవడంతో ఇంట్లో తండ్రి, కూతురు ఉంటున్నారు.. 15 రోజుల నుంచి కన్న కూతురుపై అతడు..


  జల్సాలకు ఖర్చు కాగా మిగిలిన సొమ్మును వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అసలేం జరిగిందంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు. ఇక్కడి భద్రాద్రి కో ఆపరేటివ్‌ బ్యాంకులో ఖాతాలెక్కువ. నగదు లావాదేవీలు కూడా ఎక్కువే. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజల విశ్వాసం చూరగొన్న ఈ బ్యాంకులో కొన్నేళ్ల క్రితం బ్రాంచి మేనేజరుగా పందుల రాము, అసిస్టెంట్‌ మేనేజరుగా ఎస్‌.కె.అక్బర్‌, క్యాషియర్‌గా చిత్తపోగు రామారావు, అటెండర్‌గా గనిబోయిన రవీందర్‌కుమార్‌లు చేరారు. ఒక్కొక్కరు ఒక్కో సమయంలో్ విధుల్లో చేరినప్పటికీ నలుగురి మధ్య మాంచి కెమిస్ట్రీ కుదిరింది. సామాన్య గిరిజన ఖాతాదారులు లక్షల్లో సొమ్మును తమ ఖాతాల్లో వేయడం, తీయడం నిత్యం చూస్తూ అవకాశం కోసం చూస్తున్నారు.

  Blood Donation: రక్తదానం చేస్తే ‘బరువు’ తగ్గుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..


  దీనికితోడు ఈ ప్రాంతంలో భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌, సీతారామ ఎత్తిపోతల పథకాల కోసం చేసిన భూసేకరణ సొమ్మును కూడా ఈ బ్యాంకు బ్రాంచిలోనే జమ చేసుకున్నారు. ఇలా గత కొన్నేళ్లుగా పెద్ద మొత్తాల్లో డబ్బు జమ అవుతుండడంతో ఈ నలుగురికి కన్ను కుట్టింది. ఎలాగోలా సొమ్మును కొట్టేయడానికి ప్లాన్‌ వేశారు. అమాయక గిరిజనులనే టార్గెట్‌ చేసుకున్నారు.

  డబ్బుతో వచ్చిన ఖాతాదారునికి జమ చేసిన సొమ్ము మొత్తాన్ని పాస్‌పుస్తకంలో ప్రింట్‌ తీస్తున్నారు. కానీ ఆన్‌లైన్‌లో జమ చేయడం లేదు. అలా బ్యాంకులో జమ చేయకుండా పక్కకు పెట్టిన మొత్తాన్ని సొంతానికి వాడుకున్యనారు. ఇలా గత ఏడాదిగా వాళ్లు కొట్టేసిన మొత్తం రూ.2,91,29,900గా తేలింది. దీంతో ఇంటర్నల్ ఆడిట్‌లో దొరకడం, డబ్బు కోసం వచ్చిన ఖాతాదారులకు సకాలంలో సొమ్మును సర్దుబాటు చేయకపోవడంతో తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి.

  Moles On Body: మీకు అక్కడ పుట్టమచ్చ ఉందా.. అయితే కోటీశ్వరులు అయినట్లే.. తెలుసుకోండి..


  దీంతో బ్యాంకు యాజమాన్యం అంతర్గత విచారణ నిర్వహించి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయాన్ని సీరియస్‌గా పరిగణించి దర్యాప్తు జరిపారు. యాజమాన్యం ఫిర్యాదుతో భయపడిన పై నలుగురు పారిపోవడం.. పోలీసులు వాళ్లను పట్టుకోవడం.. వాళ్ల నుంచి రూ.1,44,02,000 లను స్వాధీనం చేసుకున్నారు.

  అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కొన్నాళ్లుగా వీళ్లు కొట్టేసిన సొమ్మును భూముల కొనుగోలుకు వినియోగించినట్టు తెలుస్తోంది. మధ్యమధ్యలో అనుమానం రాకుండా ఖాతాదారులకు కొంత మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చినట్టు.. ఇక నగదు తిప్పలేక దొరికిపోయినట్టు చెబుతున్నారు. ఇలా బ్యాంకులో నగదు సదరు బ్యాంకు ఉద్యోగులే మింగిన విషయమై ఖమ్మం ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించింది.
  Published by:Veera Babu
  First published: