Home /News /telangana /

THE AUTHORITIES ARE ACTING CONSPIRATORIALLY SAYS EETELA RAJENDER VB KNR

Telangana: సీఎం కేసీఆర్ ధర్మాన్ని వదిలేశారు.. రాజీనామా చేయమని అడిగితే దర్జాగా చేసేవాణ్ణి: మాజీ మంత్రి ఈటల రాజేందర్

విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్

విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్

Huzurabad: తెలంగాణ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ చేసిన విమర్శలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ధర్మాన్ని వదిలేశారని.. సీఎం తనను పిలిచి రాజీనామా చేయమని అడిగితే దర్జాగా చేసేవాడినని వ్యాఖ్యానించారు.

ఇంకా చదవండి ...
  ఐఏఎస్ అధికారులు దారుణంగా విచారణ చేశారు. తనకు నోటీసులు కూడా ఇవ్వలేదని.. దేశ చరిత్రలో ఇలాంటి కుట్ర పూరితంగా ఎవరూ వ్యవహరించలేదని.. వ్యక్తులు ఉంటారు. పోతారు. గాని ధర్మము ఎక్కడికి పోదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. కోర్టు ద్వారా త్వరలోనే బదులిస్తానన్నారు. కనీసం వావి వరసలు కూడా లేకుండా నివేదికలో తమ పేర్లు రాశారని చెప్పారు. జమున వైఫ్ ఆఫ్ నితిన్ అని నివేదికలో రాశారని, అతను తన కుమారుడని వివరించాడు. ఈ తీరును చూస్తుంటే అధికారులు ఎవరో డిక్టేట్ చేస్తే రాసుకున్నట్లుగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. వీరి తీరు పట్ల హైకోర్టు కూడా విస్మయం చెందిన విషయాన్ని ఈటల ప్రస్తావించారు. ఒక సమస్యపై సీఎం కేసీఆర్ ను కలవడానికి వెళ్లిన తనను సెక్యూరిటీ గార్డ్స్ ఆపారని.. ఎంత బతిమిలాడినా పంపించలేదని వాపోయారు. విషయం తెలిసిన మంత్రి గంగుల కమలాకర్ ‘ఇంత దుర్మార్గం ఉంటదా అన్నా’ అని తనతో చెప్పినట్లు గర్తు చేశారు.

  మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ చేసిన కామెంట్స్ వారి విజ్ఞత కే వదిలేస్తున్నానన్నారు. చేసిన దందాలన్నీ ఎప్పటికైనా బయటపడతాయన్నారు. కొప్పుల ఈశ్వర్, రసమయి,వినోద్ కుమార్ అందరూ నాకు సన్నిహితులేనన్నారు. అన్ని పార్టీ నాయకులతో మాట్లాడుతానన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు నాయకులు కలుస్తారు కానీ ఇప్పుడు కలిస్తే పార్టీ మారుతున్నారా అని అడుగుతున్నారు.. కాంగ్రెస్ తో మాట్లాడితే నేరం బిజెపి తో మాట్లాడితే పాపం అనడం ఒక్క టీఆర్ఎస్ లోనే ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ని జమ్మికుంట కు నీళ్లు కావాలని చెప్పడం కోసం కలవడానికి వెళ్లినానని గుర్తు చేశాడు. కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం కావాలని అన్నానని గుర్తు చేశారు. వేరే పార్టీల వాళ్లతో మాట్లాడడమే తాను చేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు.

  ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని.. తనకు గౌరవం, గుర్తింపు ఇవ్వలేదని అనలేదని ఆయన పేర్కొన్నారు. తాను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని ఈటల మరోసారి నొక్కి చెప్పారు. 2014 నుండి కేసీఆర్ ధర్మాన్ని వదిలేశారు. గొప్ప వ్యక్తిగా ఉండే కేసీఆర్ ఎవరి సలహాల కారణంగానో మంత్రులను చులకనగా చూస్తూ.. ఎమ్మెల్యే లను అవమానించేలా వ్యవహరిస్తున్నారు. తాను సీఎం కావాలని ఎప్పడు అనుకోలేదని.. బయట ఎవరో అన్నమాటలకు తను ఏం చాయాని అన్నారు. ఈటల రాజేందర్ ను పిలిచి రాజీనామా చేయమంటే దర్జాగా చేసేవాడినని అన్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Etela rajender, Gangula kamalakar, Karimnagar, Koppula eeswar, Land kabja issue

  తదుపరి వార్తలు