Home /News /telangana /

THE ANCIENT OMKARESWARA TEMPLE HAS BEEN SUBMERGED IN FLOODWATERS DUE TO CONTINUOUS RAIN IN THE CENTER OF NIRMAL DISTRICT ADB PRV

Temple sunken: మళ్లీ దంచికొడుతున్న వానలు.. నీట మునిగిన నిర్మల్ ఓంకారేశ్వరాలయం

నీట మునిగిన ఓంకారేశ్వర్​ ఆలయం

నీట మునిగిన ఓంకారేశ్వర్​ ఆలయం

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి వెంకటాద్రిపేట్ ఖజాన చెరువు తీరంలో కొలువై ఉన్న పురాతన ఓంకారేశ్వర ఆలయం (OmKareshwar temple) వరదనీటిలో మునిగిపోయింది.

    (Lenin, News18, Adilabad)

    మొన్నటి వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు అతలాకుతమైన ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోందనుకుంటే మళ్లీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరోసారి తడిసి ముద్దవుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో (Heavy rains) వాగులు, వంకలు మళ్లీ పొంగిప్రవహిస్తున్నాయి. పలుచొట్ల రహదారులు కొట్టుకుపోగా, లోలెవల్ వంతెనలపై నుండి వరద నీరు (Flood water) పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి వెంకటాద్రిపేట్ ఖజాన చెరువు తీరంలో కొలువై ఉన్న పురాతన ఓంకారేశ్వర ఆలయం (OmKareshwar temple) వరదనీటిలో మునిగిపోయింది. ఆలయంలోని శివలింగంతోపాటు పరిసరాలన్నీ వరద నీటితో నిండిపోయాయి.

    రహదారులు జలమయం..

    గత 40 సంవత్సరాల క్రితం వరద నీరు ఆలయంలోకి వచ్చాయని, మొట్టమొదటిసారిగా శివలింగంతో పాటు విగ్రహాలు నీట మునిగాయని (Temple sunken) కాలనీవాసులు పేర్కొంటున్నారు. బంగల్ పేట్ వినాయక సాగర్ పూర్తిగా నిండుకొని నిండుకుండలా మారడంతో తూముల ద్వారా నీటిని బయటకు పంపే ఏర్పాటు చేశారు. దీంతో ఖజానా చెరువు నిండుకోవడంతో ఓంకారేశ్వర ఆలయం (Temple sunken), పోచమ్మ చెరువు వరద నీటిలో మునిగిపోయింది. వరద నీరు రావడంతో కాలనీవాసులను అప్రమత్తం చేశారు. ఇటు చెరువులు నిండుకుండలా మారి అలుగుల నుండి వరద ప్రవహిస్తుంది. పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయం కావదంతో వాహనాలు నడిపేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. జిల్లాలోని కడెం, గడ్డెన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టుల్లోకి వరద నీటి ప్రవాహం పెరిగింది.



    అటు ఆదిలాబాద్ జిల్లాలోనూ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటి దిగువకు వదిలిపెట్టారు. తలమడుగు మండల కేంద్రం లోని, ప్రధాన వాగు లోలెవల్ వంతెన కారణంగా చిన్న వర్షానికే వంతెన పై నుండి వరద నీరు పొంగి ప్రవహిస్తోందని స్థానిక ప్రజలు అంటున్నారు. అలాగే వాహనాల రాకపోకలకు ఇబ్బందవుతుందని, రాత్రి వేళలో వరద నీరు వంతెన పై నుండి ప్రవహిస్తే, వాహనాలపై వెళ్లేవాళ్లకు నీటి లోతు తెలియక ప్రవాహంలో కొట్టుకు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారులు దీనిపై దృష్టి సారించి నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని కోరుతున్నారు.

    అలాగే బోథ్ మండలం ధన్నూరు గ్రామస్థులు కూడా కొద్దిపాటి వర్షానికే లో లెవల్ వంతెనపై నుండి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, ఇదే విషయం అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థులంతా వర్షంలోనే లోలెవల్ వంతనపై నిలబడి నిరసన తెలిపారు. ఇచ్చోడ మండలం సిరిచెల్మ లోని మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ భారీగా వరద నీరు చేరడంతో భక్తులు తెప్పలపై దర్శనానికి ఆలయానికి వెళ్లివస్తున్నారు. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలు కూడా భారీ వర్షాలకు బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోయాయి. అత్యవసర సమయాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Floods, Hindu Temples, Nirmal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు