మాజీ ఎంపీ కవిత పిలుపు.. సింగరేణిలో నిలిచిన బొగ్గు..

కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు సింగరేణి కార్మికులు కదం తొక్కారు. ఫలితంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టీబీజీకేఎస్ ఇచ్చిన 24 గంటల సమ్మె గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సింగరేణి బొగ్గు గనుల్లో ప్రారంభమయ్యింది.

news18-telugu
Updated: July 2, 2020, 12:40 PM IST
మాజీ ఎంపీ కవిత పిలుపు.. సింగరేణిలో నిలిచిన బొగ్గు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. టీఆర్ఎస్ అనుంబంధ సంస్థ అయిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు సింగరేణి కార్మికులు కదం తొక్కారు. ఫలితంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టీబీజీకేఎస్ ఇచ్చిన 24 గంటల సమ్మె గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సింగరేణి బొగ్గు గనుల్లో ప్రారంభమయ్యింది. దీంతో అన్ని గనులు మూడపడ్డాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. సమ్మెలో భాగంగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలన్ని ఉద్యమాన్ని తీవ్రం చేశాయి. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి , బెల్లంపల్లి డివిజన్ లోని సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.

కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బొగ్గు గనులు బోసి పోయినవి. జిల్లాలో 12 భూగర్భ గనులు 5 ఓపెన్ కాస్ట్ గనులలో సుమారు 17 వేల మంది కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె సందర్భంగా ఒకరోజు సుమారు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
First published: July 2, 2020, 12:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading