హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS MLAs Poaching Case: అందుకే ఫ్లైట్ టికెట్ బుక్ చేశా..ఈడీ విచారణలో బండి సంజయ్ అనుచరుడు వివరణ

TRS MLAs Poaching Case: అందుకే ఫ్లైట్ టికెట్ బుక్ చేశా..ఈడీ విచారణలో బండి సంజయ్ అనుచరుడు వివరణ

సిట్ ముందుకు శ్రీనివాస్..ఆ ముగ్గురి హాజరుపై ఉత్కంఠ

సిట్ ముందుకు శ్రీనివాస్..ఆ ముగ్గురి హాజరుపై ఉత్కంఠ

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి సిట్ పలువురికి నోటీసులు ఇచ్చింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు జేడీజేఎస్ పార్టీ అధ్యక్షుడు తుషార్, బండి సంజయ్ అనుచరుడు, కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్, కేరళకు చెందిన డాక్టర్ జగ్గుజీస్వామికి నేడు 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే ఇప్పటివరకు కేవలం బండి సంజయ్ అనుచరుడు, కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్ మాత్రమే హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో విచారణకు హాజరైనట్లు తెలుస్తుంది. అయితే మిగతా ముగ్గురు సిట్ విచారణ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు జేడీజేఎస్ పార్టీ అధ్యక్షుడు తుషార్, కేరళకు చెందిన డాక్టర్ జగ్గుజీస్వామి హాజరు అవుతారా లేదా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.  

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ ను 5 గంటలకు పైగా ఈడీ విచారిస్తుంది. రామచంద్రభారతి (Rama chandra bharathi), సింహయాజి (Simhayaji)లకు ఫ్లైట్ టికెట్ శ్రీనివాస్ బుక్ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాస్ కు నోటీసులు ఇవ్వగా..దానిపై శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడు. తాను ఇంట్లో పూజ చేయించుకోవడం కోసమే ఫ్లైట్ టికెట్ బుక్ చేశానని శ్రీనివాస్ ఈడీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తుంది.

శ్రీనివాస్ తో పాటు సిట్ పలువురికి నోటీసులు ఇచ్చింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు జేడీజేఎస్ పార్టీ అధ్యక్షుడు తుషార్ కేరళకు చెందిన డాక్టర్ జగ్గుజీస్వామికి నేడు 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే ఇప్పటివరకు కేవలం బండి సంజయ్ అనుచరుడు, కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్ మాత్రమే హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో విచారణకు హాజరైనట్లు తెలుస్తుంది. మిగతా ముగ్గురు సిట్ విచారణ హాజరు కాలేదని తెలుస్తుంది. ఈ విచారణకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు జేడీజేఎస్ పార్టీ అధ్యక్షుడు తుషార్, కేరళకు చెందిన డాక్టర్ జగ్గుజీస్వామి హాజరు అవ్వకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.

Big News: క్యాసినో కేసులో ఈడీ దూకుడు..నిన్న మంత్రి తలసాని బ్రదర్స్..నేడు తలసాని PA..ఉచ్చు బిగుస్తుందా?

ఫ్లైట్ టికెట్ బుక్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో..

కాగా రామచంద్రభారతి (Rama chandra bharathi), సింహయాజి (Simhayaji)లకు ఫ్లైట్ టికెట్ శ్రీనివాస్ బుక్ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది.  రాంచంద్రభారతికి, సింహయాజికి శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్లు అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు సిట్ అధికారులు అతడికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఒకవేళ విచారణకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు జేడీజేఎస్ పార్టీ అధ్యక్షుడు తుషార్, కేరళకు చెందిన డాక్టర్ జగ్గుజీస్వామి కూడా హాజరు అయితే వీరిని కలిపి విచారిస్తారా లేక వేర్వేరుగా విచారించి కీలక విషయాలను బయటకు తీస్తారా అనేది చూడాలి.

తెలంగాణలో దారుణం.. ప్రసవం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన డాక్టర్.. శిశువు మృతి

తనకేం సంబంధం లేదంటున్న తుషార్..

అయితే తుషార్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా..తనకేం సంబంధం లేదని తుషార్ చెబుతున్నాడు. గత 3 రోజులుగా బెంగళూరులోనే ఉంటున్న తుషార్ విచారణకు రాలేదు.

29న హైకోర్టు ముందు నివేదిక..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ దాఖలు చేసిన పిటీషన్ పై ఇటీవల తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తుకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు (Telangana High Court) ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి నిరాకరించింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగించాలని కొన్ని కండీషన్స్ పెట్టింది కోర్టు. ఈ కేసును సిట్ చీఫ్ సీవీ ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు చేయాలి. అలాగే దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి విషయాలను అటు మీడియా, ఇటు రాజకీయ నాయకులకు వెల్లడించవద్దని హైకోర్టు తెలిపింది. దర్యాప్తుకు సంబంధించి పురోగతి నివేదికను ఈనెల 29న హైకోర్టు (Telangana High Court) ముందు ఉంచాలని కోర్ట్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నలుగురికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

First published:

Tags: Hyderabad, Telangana, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు