హోమ్ /వార్తలు /తెలంగాణ /

Eetala Rajender : తొలగించినందుకు ధన్యవాదాలు.. ఈటల స్పందన

Eetala Rajender : తొలగించినందుకు ధన్యవాదాలు.. ఈటల స్పందన

 మంత్రి ఈటల రాజేందర్ :[ ఫైల్ ఫోటో }

మంత్రి ఈటల రాజేందర్ :[ ఫైల్ ఫోటో }

Eetala Rajender : మంత్రిగా భాద్యతల తొలగింపుపై ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సంధర్భంగా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ కార్యచరణపై నియోజవర్గ ప్రజలతో సమావేశం అవుతానని చెప్పారు.

  ఈటల రాజేందర్‌ నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేయడంతో ఈటల స్పందించారు..ఈ సంధర్భంగా ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో నియోజవర్గ ప్రజలతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ నిర్వహిస్తానని తెలిపారు. కాగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సీఎం తన శాఖను తీసుకుని ఉండొచ్చని అన్నారు..కాగా సీఎంకు ఎవరిశాఖ అయినా తొలగించే అధికారం ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే యావత్ రాష్ట్ర ప్రజలు జరిగిన పరిణామాలపై ప్రజలు భగ్గుమంటున్నారని చెప్పారు.

  తన శాఖ తొలగింపుపై నియోజకవర్గం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు భాధ పడుతున్నారని అన్నారు. ఇరవై సంవత్సరాల పాటు లేని అపవాదులు ఇప్పుడు చేయడం దురదృష్టకరం అన్నారు. ఈనేపథ్యంలోనే తనపై ప్రణాళికబద్దమైన కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. నిన్నటి వరకు 100 ఎకరాలు కబ్జా చేశారని ప్రచారం , ఆరోపణలు చేశారని, పూర్తి ివిచారణ తర్వాత తాను స్పందిస్తానని చెప్పారు. కాగా సీఎం తో జరిగిన పరిణామాలపై మాట్లాడే ప్రసక్తే లేదనే చెప్పారు. అయితే భవిష్యత్ పర్యావణాలపై తగిన మూల్యం చెల్లిస్తారని ఆయన హెచ్చిరించారు.

  కాసేపటి క్రితమే ఈటల రాజేందర్‌ నిర్వహిస్తున్న వైద్యఆరోగ్య శాఖను తనకు బదాలాయించుకున్నారు సీఎం కేసీఆర్ ..దీంతో రాజేందర్‌ను నేరుగా మంత్రిపదవి నుండి ఉద్వాసన పలకకుండా పదవి తోలగించారు. దీంతో ఆయన ఏమంత్రి పదవి లేని మంత్రిగా కొనసాగనున్నారు. అయితే అధికారికంగా ఎలాంటీ శాఖ లేని ఈటల తిరిగి పార్టీలో ఉంటారా లేదా అనేది ఆయన భవిష్యత్ కార్యచరణ పై చర్చిస్తానని అన్నారు..

  కాగా ముఖ్యమంత్రి తన శాఖను తొలగించినందుకు చాల సంతోషంగా ఉందని కూడ అన్నారు. ఎలాంటీ పదవి లేకున్నా..ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈటల ఎలాంటీ ఆవేశానికి లోను కాకుండా మీడియా ముందు మాట్లాడారు.. ఆయనపై వచ్చిన ఆరోపణలపై కూలంకుషంగా చర్చించి తర్వాత మరోసారి స్పందిస్తానని చెప్పారు.. తన శాఖను తొలగిస్తారని తనకు కూడ సమాచారం లేదని చెప్పారు. పూర్తి రిపోర్టు వచ్చిన తర్వాత స్పందిస్తానని చెప్పారు..

  అసైన్డ్ భూముల విచారణలో మూడు ఎకరాల భూమి ఉన్నట్టు నివేదికలో ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే నివేదిక వచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ వెంటవెంటనే పరిణామాలు జరిగాయి..మొత్తం ఒక్కరోజులోనే మంత్రి ఈటల పై ఆరోపణలు రావడం ..ఆయనకు సంబంధించిన శాఖను తొలగించడం తో రాజకీయంగా చర్చనీయాంశం అయింది..

  Published by:yveerash yveerash
  First published:

  Tags: CM KCR, Eetala rajender, Huzurabad By-election 2021

  ఉత్తమ కథలు