బండి సంజయ్ అరెస్ట్ , ఆ తర్వాత పరిణామాలు టెన్షన్‌ను క్రియెట్ చేస్తున్నారు... ఆయన అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ఉద్రిక్తలు రేకెత్తిస్తున్నాయి.. ఇప్పటికే ఆయన అరెస్ట్‌కు నిరసనగా ఆపార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళలనకు పిలుపునిచ్చింది. మరోవైపు పోలీసు ట్రైనింగ్ సెంటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన నిర్వహించారు. అయితే పోలీసులు కొవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుండడంతో వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు బండి సంజయ్‌తో పాటు 12 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలపై పలు కేసులు నమోదు చేశారు.
కాగా పీటిసీలో ఉన్న బండి సంజయ్ రాత్రంతా పోలీసు కస్టడిలో ఉండడంతో నేడు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఆ తర్వాత కోర్టుముందు ప్రవేశ పెట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్లో 70 మందికి నోటిసులు ఇచ్చామని .. కార్యకర్తల దాడిలో పోలీసులు కూడా గాయపడ్డారని సీపీ సత్యనారయణ తెలిపారు.
కాగా పోలీసుల కస్టడీలో ఉన్న బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి మాట్లాడారు.. ఆయన కేసులకు బయపడకుండా ఉద్యోగులు , ఉపాధ్యాయుల పక్షాన నిలబడాలని ఆయన సూచించారు. కేసులు ఏవైనా ఉంటే తాము చూసుకుంటామని భరోసా ఇచ్చారు. జాతీయ నాయకత్వం మొత్తం సంజయ్ వెంట ఉంటుందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Karimnagar