Home /News /telangana /

TENSIONS IN BASRA WITH TRIPLE IT STUDENTS DHARNA PAWAN KALYAN REQUESTS TO RESOLVE PROBLEMS SNR ADB

Basara : బాసర ట్రిపుల్‌ ఐటీ స్టూడెంట్స్‌తో సర్కారు చర్చలు విఫలం.. కొనసాగుతున్న ధర్నా

(కొనసాగుతున్న ఆందోళన)

(కొనసాగుతున్న ఆందోళన)

Basara:సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధులు వెనక్కి తగ్గడం లేదు. ఐదో రోజు కూడా తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో బాసరలో అధిక పోలీసు భద్రత పెంచారు పోలీసులు. మద్దతిచ్చేందుకు వస్తున్న నేతల్ని ఎక్కడిక్కడ అరెస్ట్‌లు చేస్తూ పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    (K.Lenin,News18,Adilabad)
    నిర్మల్(Nirmal)జిల్లా బాసర (Basara)ట్రిపుల్ ఐటిలో నెలకొన్న 12 సమస్యలను వెంటనే పరిష్కారించాలని స్టూడెంట్స్ చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. గత ఐదు రోజులుగా విద్యార్ధులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలిపేందుకు వస్తున్న వివిధ పార్టీల నాయకులు , ప్రజాంసంఘాల నేతలను పోలీసులు అరెస్ట్‌లు చేస్తూనే ఉన్నారు. శుక్రవారం(Friday) రాత్రి రాత్రి బాసర ట్రిపుల్ ఐటి డైరెక్టర్ (Basra IIIT director)సతీష్ కుమార్ (Satish Kumar)విద్యార్థులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ చర్చలు రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగాయి. డిమాండ్లను నెరవేర్చే వరకు తమ నిరసనలు ఆపే ప్రసక్తి లేదని రెగ్యులర్ వైస్ చాన్సలర్(Regular Vice Chancellor) ను నియమించాలని పట్టుబట్టారు.

    నివురుగప్పిన నిప్పులా నిర్మల్‌ జిల్లా ..
    ప్రధానంగా బాసర ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో బోధకుల కొరతను తీర్చాలని, రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలని, ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని, ల్యాబ్‌లో వసతులతోపాటు ఇతర మౌళిక సదుపాయాలను కల్పించాలని, మెస్‌ టెండర్ల ప్రకారం అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. క్యాంపస్ లోపల ఆందోళన చేపట్టిన విద్యార్థులు మేయిన్ గేట్ నుండి కనిపించకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారంతోపాటు రెండ గేటు వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. అడుగడుగునా పోలీసులు ఆంక్షలను అమలు చేస్తున్నారు. మూడంచెల బందోబస్తును ఏర్పాటు చేశారు. విద్యార్థులను కలిసేందుకు కనీసం వారి తల్లిదండ్రులకు కూడా అవకాశం కల్పించడం లేదు. నేతలనైతే అరెస్టు చేసి నేరుగా బాసర పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారు.

    (చర్చలు విఫలం..ధర్నా కొనసాగింపు)


    చర్చలు విఫలం..
    శుక్రవారం విద్యార్ధుల ధర్నాకు మద్దతిచ్చేందుకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ తర్వాత కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, మహేశ్వర్‌రెడ్డిని నర్సాపూర్ (జీ) దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. బాసరకు ఆర్టీసీ బస్సులో వస్తున్న నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవిని బాసర గోదావరి నది బ్రిడ్జి దగ్గర ఆదిలాబాద్ మాజీ ఎం.పి రాథోడ్ రమేష్‌ను దిలావర్‌పూర్‌ దగ్గర అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.



    పోలీసు భద్రత పెంపు..
    క్యాంపస్‌లో చదువుతున్న విద్యార్ధులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయని విద్యార్ధులు గత ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ తమ క్యాంపస్‌కు వచ్చి సమస్యల్ని స్వయంగా పరిశీలించి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పందించారు. విద్యార్థుల సమస్యల పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూల చర్యలు చేపట్టాలన్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీని ఏ లక్ష్యం కోసం ఏర్పాటు చేశారో అది నెరవేరే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని జనసేనాని హితవు పలికారు.

    ఇది చదవండి: ఫాదర్స్ డే సందర్భంగా టీఎస్ఆర్టీసీ బంపరాఫర్.. ఫాదర్స్ అందరికీ ఫ్రీగా జర్నీ చేసే ఛాన్స్.. ఆఫర్ వివరాలివే

    Published by:Siva Nanduri
    First published:

    Tags: Basara IIIT, Nirmal district, Telangana govt

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు