Home /News /telangana /

TENSION INTO DALIT FAMILY FOR DALITA BHANDU IN CONSTIUENCIES VRY

Karimanagar : వంద మందికే దళిత బంధు.. గ్రామానికి ఒక్కరేనా... పారదర్శకంగా ఎంపిక చేస్తారా...?

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

Karimanagar : నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులు.. అదికూడా ఎమ్మెల్యే చెప్పిన వారికనంటూ ఆదేశాలు.. దీంతో ఆ వందమంది ఎంపిక పారదర్శకంగా జరుగుతుందా లేదా అనే మీమాంసలో దళిత కుటుంబాలు.. దీంతో తమకు మొండి చేయిచూపుతారా అనే ఆందోళనలో దళిత కుటుంబాలు.

ఇంకా చదవండి ...
    ( కరీంనగర్ జిల్లా.న్యూస్ 18తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి.)

    తెలంగాణ రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు అనే పథకం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.. . ఎస్సీ సామాజిక వర్గంలో ఎందరు పేదలున్నారో వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బందు పథకం ప్రవేశపెట్టింది . ఈ పథకం దళితులకు మంచిదే అయినా.. రాష్ట్ర ప్రభుత్వ ఈ పథకం అమలు పరుస్తున్న తీరులో అనేక సందేహాలున్నాయి. . దళితులలో ఎన్నో ఆశలు రేపిన ఈ పథకం చివరికి ఎవరి దక్కనుందో ... దళితులు అందరు మాకు ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారు . అయితే ప్రభుత్వం ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టి ముందుగా హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఉప ఎన్నికల ముందు హుజురాబాదు లోని కొంత మందికి దళితులకు దళిత బంధు పథకం అందజేశారు . హుజురాబాద్ ఉప ఎన్నికలో కేవలం ఒక్క నియోజకవర్గంలో కాదని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రతిపక్షాలు ఒత్తిడి చేయడంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దళిత బందు పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది .

    ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకం ఫిబ్రవరి లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి మార్చి 31లోపు వారికి పంపిణీ చేసేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది . నియోజకవర్గంలోని వంద మందికి మాత్రమేనని నిబంధన పెట్టడంతో పాటు దళిత బంధు పథకం ఎంపికకు స్థానిక ఎమ్మెల్యేకు లింకు పెట్టడంతో ఈ పథకం ఎంపిక సక్రమంగా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . ఈ క్రమంలోనే ఎక్కువగా టిఆర్ఎస్ వర్గానికి చెందిన దళితులనే ఈ పథకం ఎంపిక చేస్తారనే వాదన వినిపిస్తోంది . టీఆర్ఎస్ పార్టీకి చెందిన చోటా మొటా దళిత నాయకులకు ఈ పథకం అమలు పరిచేలా ఎమ్మెల్యేలు చేస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .

    Hyderabad : మైనర్ బాలిక ఒంటిపై పంటిగాట్లు..! ఆరు నెలలుగా బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి.

    Waranagal : ప్రియుడి డబ్బుతోనే కిడ్నాప్..భయపెట్టి, బలవంతంగా.. అడవిలోకి తీసుకువెళ్లింది..ఆ తర్వాత..

    దీంతో పార్టీల కతీతంగా ఈ పథకం అమలుపరిస్తేనే మంచిది అని పలువురు చర్చించుకుంటున్నారు . ఎంపికలో నిరుపేద , అర్హులైన దళితులకు ఈ పథకాన్ని అందించి దళితులకు న్యాయం చేయాలని దళితులు కోరుతున్నారు . ప్రతి నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేయాలని అధికారులకు సూచించడంతో ఒకొక్క మండలానికి 20 మంది మాత్రమే ఎంపిక చేయాల్సిన పరిస్థితి అధికారులకు ఏర్పడింది . అంటే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దళితున్ని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంటుంది . ఆయా గ్రామాల్లో మిగతా . దళితులందరూ ఈ పథకం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అందుకని ఈసారి కూడా అందని ద్రాక్షగా ఉంది . దళితబందు పథకానికి ఏ దళితునికి అదృష్టం వరిస్తుందో వేచి చూడాల్సిందే మరి ..
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Dalitha Bandhu, Karimnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు