TENSION BETWEEN TWO STATE POLICE TO TAKE DEAD BODY WHO KILLED BY MAOIST KMM VRY
Maoist attack : ఎవరిది బాధ్యత..? అడవిలో డెడ్‌బాడి... స్వాధీనంపై ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం..
Maoist attack
Maoist attack : మావోయిస్టుల చేతిలో హతమైన రమేశ్ మృతదేహం స్వాధీనంపై రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య సస్పెన్స్ నెలకొంది. ఇరు రాష్ట్రాల పోలీసులు రమేశ్ మృతదేహం బాధ్యత తమది కాదంటే.. తమది కాదంటూ చేతులెస్తున్నారు..
బుధవారం ఉదయం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టుల చేత కిడ్నాప్‌కు గురైన మాజీ సర్పంచ్ రమేశ్‌ను ఇన్ఫార్మర్గా పేర్కొంటు హతమార్చిన విషయం తెలిసిందే.. అయితే ఎన్కౌంటర్ స్థలం నుండి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడంలో అటు చత్తీస్‌గఢ్ పోలీసులు ఇటు తెలంగాణ రాష్ట్ర పోలీసుల మధ్య వివాదం నెలకొంది. ( ex sarpanch killed by maoist ) కాగా మరోవైపు మృతదేహం వద్దకు చేరుకున్న రమేశ్ భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
పోలీస్ ఇన్ఫార్మర్ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రమేశ్‌ను 20వ తేదీ సాయంత్రం కిడ్నాప్ చేశారు. తర్వాత కొంతమంది మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించి హతం చేశారు. ( ex sarpanch killed by maoist )రమేశ్ పోలీసు ఇన్ఫార్మర్ గా వ్యవహరించి మావోయిస్టుల మృతికి కారణం అవ్వడంతో పాటు మరికొంతమంది ఎన్‌కౌంటర్‌కు కూడా కారణమయ్యాడని పేర్కోన్నారు. డబ్బులకు ఆశపడి పోలీసులకు సమాచారం అందించినట్టు లేఖలో పేర్కొన్నారు. రమేశ్ హత్య అనంతరం మావోలు ఓ లేఖను విడుదల చేశారు. ( ex sarpanch killed by maoist )చత్తీస్ఘడ్,తెలంగాణ సరిహద్దు అడవుల్లో హతమార్చినట్టు చెప్పారు.
కాగా రమేశ్ కుటుంబం గత కొద్ది రోజులుగా ములుగు జిల్లా ఏటూరునాగరం లో నివసిస్తున్నారు. రమేష్ కారు డ్రైవింగ్ చేస్తుండగా ఆయన భార్య రజిత ఏటూరునాగరం ప్రభుత్వ ఆసుపత్రిలో కాట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తోంది. ( ex sarpanch killed by maoist )20వ తేది సాయంత్రం కిడ్నాప్ అయిన తర్వాత రమేష్ భార్య రజిత మావోయిస్టులను వేడుకుంది. తన భర్తకు ఎలాంటీ హాని తలపెట్టవద్దని ,ఏదైనా తప్పు చేస్తే క్షమించి వదిలిపెట్టాలని వేడుకుంది.( ex sarpanch killed by maoist ) కాని మావోస్టులు కిడ్నాప్ తర్వాత అంత్యంత వేగంగా స్పందించారు. కిడ్నాప్ చేసిన రమేష్‌ను మంగళవారం సాయంత్రమే హతమార్చినట్టు తెలుస్తోంది. దీంతో చాలా రోజుల తర్వాత తెలంగాణలో మావోయిస్టుల అలజడితో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. మరోవైపు ఈ సంఘటన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల ప్రజాప్రతినిధులు సైతం పట్టణ బాట పట్టినట్టు సమాచారం.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.