Telangana Health : వైద్య రంగానికి 10,000 కోట్లు... మెరుగైన వైద్యం కోసం సబ్‌కమిటీ

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana cabinet on health : తెలంగాణలో ప్రజారోగ్యానికి పెద్దపేట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యరంగాన్ని పూర్తిగా ఆధునికరించడంతో పాటు భవిష్యత్‌‌ను దృష్టిలో పెట్టుకుని వైద్య సదుపాయాల్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం వైద్య అభివృద్దికి రెండు సంవత్సరాల్లో పదివేల కోట్ల రూపాయాలను ఖర్చు పెట్టి పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని అందించాలని నిర్ణయించింది.

  • Share this:
వైద్య రంగానికి నూతన హంగులు

రాష్ట్ర ప్రభుత్వం కనీస అవసరాలపై దృష్టి సారించింది..కరోనా ఉదృతితో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రభుత్వం భవిష్యత్‌లో ఎలాంటీ పరిణామాలనైనా ఎదుర్కొని ప్రజలకు మెరుగైన వైద్యం పూర్తిగా ఉచితంగా అందించేందుకు అడుగుటు వేస్తోంది..ఈ క్రమంలోనే మంగళవారం భేటి అయిన రాష్ట్ర క్యాబినెట్ వైద్య రంగ అభివృద్దికి పలు నిర్ణయాలు తీసుకుంది.  ప్రభుత్వ దవాఖానల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు సబ్ కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ .. వైద్య ఆరోగ్య కేబినెట్ సబ్ కమిటీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షులుగా, మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పి. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉండనున్నారు... వీరిని దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటుగా, ఉత్తమమైన వైద్య ఆరోగ్య సేవలను అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంక కు కూడా వెళ్లి  అధ్యయనం చేసి, సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్ ఆదేశించింది

జిల్లాల్లో నూతన ఆసుపత్రులు

రాష్ట్రం మొత్తం మీద అత్యధునిక వైద్య సదుపాయాలు కేవలం రాజధానిలో ఉండడంతో ప్రతి చిన్న రోగానికి హైదరాబాద్ వస్తున్న పరిస్థితిని భవిష్యత్‌లో రాకుండా ఉండేందుకు ఆయా జిల్లాలోనే సూపర్ స్పేషాలిటి ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల ఆసుపత్రులను నిర్మించాలని, ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.దీంతోపాటు సూర్యాపేటలో ప్రస్థుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల హెల్త్ ప్రోఫెల్‌ను రికార్డ్ చేయాలని నిర్ణయించిన సీఎం కేసిఆర్ తాజాగా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ముందుగా తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను ములుగు సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఆధునూతన డయాగ్నోస్టిక్ కేంద్రాలు

నేటి నుండి ప్రారంభించబోతున్న 19 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలతో పాటు మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ డిజిటల్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్, టుడీ ఈకో తోపాటుగా మహిళల కాన్సర్ స్క్రీనింగ్ కోసం ‘మామో గ్రామ్’ యంత్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఎలర్జీ జబ్బుల పరీక్షలు ట్రీట్ మెంట్ కోసంగా ప్రత్యేక కేంద్రాలను హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పెరుగుతున్న రోగుల రద్దీ రీత్యా ప్రస్థుతం రాష్ట్రంలోని డయాలసిస్ కేంద్రాలలో మరిన్ని డయాలసిస్ యంత్రాలను పెంచడంతో పాటు నూతనంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం.

జిల్లా కేంద్రాల్లోనే కేన్సర్ రోగులకు కీమో థెరపి

కేన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే కీమో థెరపీ రేడియో థెరపీ కొరకు అవసరమైన మౌలిక వసతులతో జిల్లా కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అన్ని దవాఖానాల్లో అవసరాలను అందుకునే విధంగా బ్లడ్ బ్యాంకులను ఆధునీకరించి అవసరమైన మేరకు నూతన బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్యానికి సంబంధించి ఆర్థోపెడిక్, న్యూరాలజీ తదితర ప్రత్యేక విభాగాలలో, మెరుగైన వైద్య సేవలకోసం కావలసిన మౌలిక వసతులను కల్పించి, అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.

ఎయిమ్స్ తరహాలో వరంగల్

వరంగల్‌లో ఖాళీ చేస్తున్న జైలు ప్రదేశంలో, దేశంలోనే అత్యుత్తమంగా వైద్యసేవలందస్తున్న ఎయిమ్స్ తరహాలో దవఖానాను ఏర్పాటు చేసి అన్ని రకాల స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలందించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ఎండీ హాస్పిటల్ అడ్మిస్ట్రేషన్ కోర్సు అభ్యసించిన అర్హులైన వారిని నియమించుకుని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వినియోగించాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్య సేవల్లో భాగం పంచుకునే నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులను, లాబ్ టెక్నీషియన్ రేడియాలజీ టెక్నిషియన్ డయాలసిస్ టెక్నిషియన్ వంటి ప్రత్యేక నైపుణ్య కోర్సులను అవసరమైనంత మేరకు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యకళాశాలల్లో అందుబాటులోకి తేవాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.

మాతా శిశుకు ప్రత్యేక వైద్యం

రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ కు సంబంధించిన వైద్య సేవలను మరింతగా పటిష్టపరిచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే వరంగల్ గాంధీ ఆసుపత్రిని మాతా శిశు ప్రత్యేక ఆసుపత్రిగా మార్చనున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు ఖమ్మంలోని సత్తుపల్లి,మధిర ఆసుపత్రులను కూడా మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులకుగా మార్పులు చేయనున్నారు..ఇందుకు అనుగుణంగానే ఆసుపత్రులకు వచ్చే గర్భినిలను ఇతర రోగులతో కలపకుండా తల్లీ బిడ్డలకు ప్రత్యేకంగా వైద్యసేవలందించాలని, అందులో భాగంగా, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు ప్రత్యేకంగా భవనాలను నిర్మించి వసతులు కల్పించాలని కేబినెట్ ఆదేశించింది. ఈ ప్రత్యేక భవనంలోనే హై రిస్క్ ప్రసవాలవసరమైన గర్భిణీల వైద్యసేవలం కోసం ప్రత్యేక ‘ మెటర్నల్ ఐ సీ యూ’ లను , నవజాత శిశువుల కోసం ఎస్ ఎన్ సీ యూ లను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. గర్భం దాల్చిన మూడో నెలనుంచి గర్భిణీలకు సమతుల పౌష్టికాహార కిట్టు ను అందించాలని నిర్ణయించారు.
Published by:yveerash yveerash
First published: