హోమ్ /వార్తలు /తెలంగాణ /

Khammam: ప్రభుత్వ నిబంధనలు పాటించని కోవిడ్ ఆసుపత్రుల అనుమతి రద్దు...

Khammam: ప్రభుత్వ నిబంధనలు పాటించని కోవిడ్ ఆసుపత్రుల అనుమతి రద్దు...

Khammam: ప్రభుత్వ నిబంధనలను పాటించని 10 ఆసుపత్రుల అనుమతులు రద్దు చేస్తూ.. ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 64 ఆసుపత్రులకు ఇచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గత రెండు రోజులుగా చర్యలు చేపడుతోంది.

ఇంకా చదవండి ...

  జి. శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు,

  ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన ఖమ్మం నగరంలోని 10 ప్రవేటు ఆసుపత్రులకు కోవిడ్ వైద్య సేవల అనుమతులను రద్దు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి తెలిపారు. బిల్లుల్లో పారదర్శకత లేకపోవడం, కోవిడ్ ప్రొటోకాల్ నిబంధనలు పాటించకపోవడం.. పరిమితికి మించి రోగులను చేర్చుకోవడం.. లాంటి కారణాలను పేర్కొన్నారు. టాస్క్ఫోర్స్ విస్తృత దాడుల అనంతరం నిబంధనలను ఉల్లంఘించిన ఆసుపత్రులపై కొరడా ఝలిపించారు.

  ఈ నేపథ్యంలోనే రెండు రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లో చర్యలు చేపడుతున్న వైద్య ఆరోగ్య శాఖ నేటి వరకు మొత్తం ముప్పై ఆసుపత్రులను కోవిడ్ చికిత్స అందించకుండా అనుమతులను రద్దు చేసింది.  కాగా మొత్తం 64 నాలుగు ఆసుపత్రులు నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించి నోటీసులు అందజేశారు.

  ఖమ్మం నగరంలోని ఆ ఆసుపత్రుల అనుమతి రద్దు చేసిన ఆసుపత్రులు జాబితాలో

  1. విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

  2. క్యూర్ హాస్పిటల్

  3. ప్రశాంతి హాస్పిటల్స్

  4. మార్వెల్ హిస్పిటల్

  5. జనని చిల్డ్రన్ హాస్పిటల్

  6. ఇండస్ హాస్పిటల్

  7. విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

  8. శ్రీ బాలాజీ చెస్ట్ మరియు డయాబేటాలాజి సెంటర్

  9. న్యూ హోప్ హాస్పిటల్

  10. సంకల్ప సి స్టార్ హాస్పిటల్స్ ఉన్నాయి.

  10 ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ సేవలను అందించడంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినట్లు, అధిక ఫీజులు వసూలు చేసినట్లు బాధితుల నుండి పిర్యాదులు అందిన పిమ్మట, టాస్క్ ఫోర్స్ బృందం నిర్దారించినందున అట్టి హాస్పిటల్స్ కు జారీ చేయబడినటువంటి కోవిడ్ సేవల అనుమతులను రద్దు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. జిల్లా ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించవలసిందిగా ఒక ప్రకటనలో కోరారు.

  First published:

  Tags: Corona treatment, Hospitals, Khammam

  ఉత్తమ కథలు