హోమ్ /వార్తలు /తెలంగాణ /

మహానగరంలో మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడెక్కడంటే..

మహానగరంలో మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడెక్కడంటే..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

ట్రాన్స్‌కో మల్లెపల్లి ఫీడర్‌లో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల గొండకొండ్లలోని జలమండలి పంపింగ్ స్టేషన్‌లో రెండు దఫాల్లో దాదాపు మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల కృష్ణా ఫేజ్ 1, 2, 3ల ద్వారా మంచినీటి తరలింపులో ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ఇంకా చదవండి ...

    హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం కలగనున్నట్టు హైదరాబాద్ జలమండలి తెలిపింది. ట్రాన్స్‌కో మల్లెపల్లి ఫీడర్‌లో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల గొండకొండ్లలోని జలమండలి పంపింగ్ స్టేషన్‌లో రెండు దఫాల్లో దాదాపు మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల కృష్ణా ఫేజ్ 1, 2, 3ల ద్వారా మంచినీటి తరలింపులో ఇబ్బందులు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం 1 గంటకు ఏర్పడ్డ విద్యుత్ అంతరాయం 4 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడింది. దీంతో పంపుల ద్వారా నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఫలితంగా గోషామహాల్, రియాసత్ నగర్, నవోదయ కాలనీ, రెడ్ హిల్స్, నారాయణగూడ, మారేడ్‌పల్లి, సాహెబ్ నగర్, బీరప్పగడ్డ, ఓఆర్ఆర్, ఎస్‌ఆర్ నగర్, హాఫీజ్ పేట డివిజన్లలో మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.

    Published by:Anil
    First published:

    Tags: GHMC, Hyderabad, Water Crisis

    ఉత్తమ కథలు