Home /News /telangana /

TEMPLES ACROSS THE STATE TO BE OPEN FOR DEVOTEES DARSHAN SAYS MINISTER INDRAKARAN REDDY SK

తెలంగాణలో సోమవారం నుంచి ఆలయాల్లో భక్తుల దర్శనాలకు అనుమతి

యాదాద్రి నరసింహస్వామి ఆలయం

యాదాద్రి నరసింహస్వామి ఆలయం

ఆలయాలను తరచూ శానిటైజ్ చేయాలని ఇప్పటికే ఆయా దేవాలయ అధికారులకు సూచనలు చేశారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

    లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో దేశవ్యాప్తంగా ఆలయాలు తెరచుకుంటున్నాయి. తెలంగాణలోనూ సోమవారం నుంచి ఆలయాల్లో భక్తుల దర్శనాలకు అనుమతి ఇస్తున్నామని దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఐతే
    ఆలయాలను తరచూ శానిటైజ్ చేయాలని ఇప్పటికే ఆయా దేవాలయ అధికారులకు సూచనలు చేశారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఐతే కంటైన్మెంట్ జోన్‌లో ఉన్న ఆలయాల్లో భక్తుల దర్శనాలకు అనుమతించోమని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాదు కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్న వారు ఆలయాలకు వెళ్లకూడదని సూచించారు. ఈ నేపథ్యంలో యాదాద్రి నరసింహస్వామి, భద్రాద్రిలోని సీతారామాలయంతో పాటు అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తులకు దర్శనం కల్పిస్తారు. టికెట్లను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.

    కాగా, కేసులతో తెలంగాణలో ఇప్పటి వరకు 3,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. కరోనా వైరస్‌‌తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 1587 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1455 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 105కి చేరింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా ఇతర దేశాల నుంచి తెలంగాణకు 458 మంది వచ్చారు. వీరిలో 212 మందికి కరోనా సోకింది. అటు ఇతర రాష్ట్రాల నుంచి శ్రామిక్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు, ఇతర వాహనాల ద్వారా వచ్చిన వారిలో 206 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Lockdown relaxations, Telangana, Yadadri

    తదుపరి వార్తలు