Nizamabad : పూజలకు పెట్టుబడి... కోటి రూపాయలతో ఉడాయించిన పూజారి..!

Nizamabad : పూజలకు పెట్టుబడి...

Nizamabad : భక్తుల బలహీనతను ఆసరా చేసుకున్న ఓ పూజారి..పూజల పేరుతో ఒకరికి తెలియకుండా మరోకరిని మోసం చేశాడు..పూజల కోసం తనకు పెట్టుబడి పెడితే కమిషన్ ఇస్తానని నమ్మబలికి మొత్తం కోటి రూపాయలకు పైగా సోమ్ముతో ఉడాయించాడు.

  • Share this:
    నిజమాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గత కొన్నాళ్లుగా పూజారిగా పనిచేస్తున్న శ్రీనివాస శర్మ.. వేద మంత్రాల పేరు చెప్పి గ్రామ ప్రజలను నిండా ముంచాడు..ముందస్తు ప్లాన్‌గానే ఇతర ప్రాంతం నుండి ఆ గ్రామంలో మకాం వేశాడు. అదికూడా తాను ఎవరో కూడా బయట పడకుండా ఆధార్ కార్డుతోపాటు సిమ్ కూడా ఫేక్ సృష్టించాడు. కరోనా కష్టకాలంలో తన పథకానికి తెరలేపాడు. తమ కష్టాలను దేవుడికి చెప్పుకునేందుకు వచ్చిన మహిళా భక్తులను తన మాయమాటలతో మోసం చేశాడు. ప్రత్యేక పూజలు అంటూ నమ్మించాడు. ఆ పూజలు చేయడం ద్వార ఆర్ధికంగా బలపడతారని మాయమాటలు చెప్పాడు

    అయితే ఆయన మాటలను నమ్మిన గ్రామ ప్రజలు పూజలు చేశారు. అయితే శ్రీనివాస శర్మ ఇక్కడే అసలు కథకు తెర లేపాడు. తనకు బడా వ్యాపారులు తెలుసని, వారు ఈ పూజలు చేయించుకునేందుకు సిద్దంగా ఉన్నారని అయితే... వారు స్వయంగా ఇక్కడకు రాలేరు గనుక ముందుగా కొంత పెట్టుబడి పెట్టి పూజలు చేయాలని చెప్పారు.అనంతరం పెట్టుబడులు పెట్టిన వారికి కమీషన్ రూపంలో డబ్బులు ఇస్తానని చెప్పారు. దీంతో గ్రామంలోని సుమారు నలబై మంది మహిళ వద్ద కోటి ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇందుకోసం వారికి చెక్కులను కూడా ఇచ్చాడు. అయితే ఆ చెక్కులు కూడా ఒకరు ఇచ్చిన వాటిని మరోకరికి, ఇచ్చి మోసం చేశాడు. ఇలా కమీషన్ రూపంలో ముందుగా కొంతమంది మహిళలకు డబ్బులు కూడా చెల్లించాడు.ఇక దీనికి తోడు చిట్టీల పేరుతో కూడ కొద్ది రోజులు కథ నడిపించాడు.

    దీంతో చాలా మంది మహిళలు తమ ఇంట్లో ఒకరికి తెలియకుండా మరోకరు పూజారికి డబ్బులు చెల్లించారు. ఇక గ్రామానికి చెందిన ఓ మహిళ తన భూమి అమ్మగా వచ్చిన మొత్తం 25 లక్షల రూపాయలను పూజారీ చేతిలో పెట్టి కన్నీరు మున్నిరవుతుంది. మరోవైపు తమ భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న సోమ్మును పూజారి రూపంలో మాయం చేశాడు. భక్తులతో పూజలు చేయించి, తిరిగి ఆ డబ్బులను హూండీలో వేయించి మరి దోపిడి చేశాడు..

    ఇంతకి అడ్రస్ లేకుండా పూజారీ ఎలా అయ్యాడనేదానికి గ్రామస్థులే కారణమయ్యారు. తాను అంతకు ముందు కరీంనగర్ జిల్లాలోని ఓ గుళ్లో పూజారిగా పని చేశానని చెప్పాడు. అందుకు సంబందించి ఫేక్ ఐడీలను సృష్టించి గ్రామస్థులను నమ్మించాడు. దీంతో వారు ఆ పూజలు చేసే గుళ్లోనే ఆశ్రయం కల్పించారు. కాగా కొద్ది రోజుల క్రితం తన కూతురుకు కరోనా వచ్చిందంటూ ఉడాయించాడు. దాదాపు కోటిన్నర రూపాయల స్కామ్ చేసి పారిపోయాడు..అయితే వెళ్లిపోయిన కొద్ది రోజుల పాటు ఫోన్ స్విచ్ ఆన్‌లో పెట్టుకున్న పూజారి ఇటివల ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో విషయం బయటపడింది. కాగా పూజారి వాడే ఫోన్ నంబర్ తోపాటు మొబైల్ కూడా గ్రామస్థులు వారి పేరు మీద ఇప్పించిందే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే భాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:yveerash yveerash
    First published: