Telangana Winter Update: ఇగం ఇరగదీస్తున్నది.. చలికి వణుకుతున్న ఆదిలాబాద్

ప్రతీకాత్మక చిత్రం

Telangana Winter Update: కొద్ది రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇప్పటికే పులి భయంతో వణుకుతున్న గిరిజనానికి చలి కూడా తోడైంది. దీంతో వారంతా ‘చలి-పులి’  బాధలు ఎప్పుడు తొలుగుతాయా..? అని ఎదురుచూస్తున్నారు.

 • News18
 • Last Updated :
 • Share this:
  తెలంగాణలో చలి పంజా విసురుతున్నది. మారుమూల పల్లెటూరు మొదలు మెట్రో నగరం దాకా చలి పులి వణికిస్తున్నది. గడిచిన నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు స్టాక్ మార్కెట్ కంటే దారుణంగా పడిపోతున్నాయి. ఇక తెలంగాణ కాశ్మీరం గా పేరున్న ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్ అయితే చలికి గజగజా వణుకుతున్నది. రోజంతా ప్రజలు ఇగం (చలి) తో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారు 40 శాతం అటవీ ప్రాంతమే ఉండటంతో గిరిపుత్రులతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇప్పటికే పులి భయంతో వణుకుతున్న గిరిజనానికి చలి కూడా తోడైంది. దీంతో వారంతా ‘చలి-పులి’  బాధలు ఎప్పుడు తొలుగుతాయా..? అని ఎదురుచూస్తున్నారు.

  ఇదిలాఉండగా... రోజురోజుకు ఉష్ణోగ్రతలు దిగువకు పడిపోతుండటంతో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నమోదవుతున్నాయి. తాజాగా నాలుగు డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతం గజగజ వణుకిపోతున్నది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 4.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

  ఈ సీజన్ లొనే ఇక్కడ ఇప్పుడు అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో ఎటు చూసినా చలిమంటలు దర్శనమిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు భయట కాలుపెట్టాలంటే జంకుతున్నారు. ఆదిలాబాద్ లోనే కాదు.. ఏజెన్సీ ప్రాంతాలైన మంథని, మహదేవపూర్, కాళేశ్వరం, ఏటూరు నాగారం, ములుగు, మంగపేట తో పాటు ఖమ్మంలోని చర్ల, భద్రాచలం  డివిజన్లలో కూడా చలి పులికి జనం అవస్థలు పడుతున్నారు. గిరిజన  ప్రాంతాల్లోనే గాక నగరాల్లోనూ చలి తన ప్రతాపం చూపిస్తున్నది.
  Published by:Srinivas Munigala
  First published: