హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth reddy : రేవంత్ రెడ్డి క్యాండిల్ ర్యాలీ.. రైతుల పోరాటాన్ని టీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు

Revanth reddy : రేవంత్ రెడ్డి క్యాండిల్ ర్యాలీ.. రైతుల పోరాటాన్ని టీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు

revanth reddy

revanth reddy

Revanth reddy : దేశ వ్యాప్తంగా రైతు దివస్ గా పాటిస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో చనిపోయిన రైతులకు సంఘీబావంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది.

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేంద్రం తీసుకువచ్చిన నూతన రైతు చట్టాల రద్దు పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళిగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీనేతలు ఎమ్మెల్యేలు పాల్గోన్నారు. కాగా కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాల రద్దుతో నేడు దేశవ్యాప్తంగా రైతు విజయోత్సవ దివస్ పాటించాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నెక్లెస్‌ రోడ్డులో ర్యాలీని చెపట్టారు. అనంతరం చనిపోయిన రైతులకు నివాళులు అర్పించారు.

  కాగా ర్యాలీలో పాల్గోన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల పొలల్లో ఉన్న వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ.. సుమారు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల రైతులు వ్యతిరేకించడంతో చట్టాల రద్దు ప్రకటనను పీఎం నరేంద్ర మోడి రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని అన్నారు. ఇక దేశంలోని అదాని , అంబానీలకు దేశాన్ని కట్టబెట్టెందుకు పీఎం నరేంద్రమోడి ప్రయాత్నాలు చేస్తుంటే ఆ చట్టాలకు మద్దతు సీఎం కేసీఆర్ మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. సంవత్సర కాలంగా రైతులు ఆందోళన చేస్తుంటే దానికి పరిష్కారం చూపకుండా కేంద్రం వ్యవహరిస్తే రైతులు త్యాగాలు చేసి వాటిని రద్దు చేయించారని అన్నారు.

  ఇది చదవండి : ఆయన కలెక్టరే అయినా.. పిల్లలు మాత్రం అంగన్‌వాడి స్కూళ్లో..


  అయితే తెలంగాణలో మాత్రం రైతు చట్టాల రద్దును తమ ఘనతగా చెప్పుకుంటూ సీఎం కేసిఆర్‌కు పాలభిషేకం చేస్తున్నారని అన్నారు.. గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ , రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తే కనీసం పట్టించుకోకుండా... నేడు పాలభిషేకాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ సరిహద్దు లో ఉన్న రైతులకు ఏనాడైన మద్దతు పలికావా అని ప్రశ్నించారు.. ఢిల్లీలో మోడి వద్దకు మోకరిల్లిన సీఎం కేసిఆర్ కనీసం రైతులను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కేసిఆర్ చెప్పినట్టు మోడిని భయపెట్టి చట్టాలను రద్దు చేయించి ఉంటే అదే భయంతో తెలంగాణలోని రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ఎందుకు కోనుకోలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతులు కష్టపడి చట్టాలు రద్దు చేయిస్తే.. దాన్ని తమ ఖాతాలో వేసుకునే కుటిల యత్నాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తెరతీసిందని ఆయన మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తోడు దొంగలేనని అభివర్ణించారు.

  వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగనాటకాలు కట్టిపెట్టి వెంటనే ఢిల్లికి వెళ్లి తెలంగాణ రైతుల వరిధాన్యం కొనుగోలు చేసే విధంగా పీఎం మెడలు వంచడానికి జంతర్ మంతర్‌లో దీక్ష చేపడితే అప్పుడు సీఎం కేసిఆర్ ను తెలంగాణ ప్రజలు నమ్ముతారని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Revanth Reddy, Telangana, Telugu Cinema News, TS Congress

  ఉత్తమ కథలు