Adilabad | ఓ వైపు పులి, మరోవైపు చిరుత.. భయం భయంగా జనం

ప్రతీకాత్మక చిత్రం

Cheetah in Adilabad District | ఓ వైపు పులి, మరోవైపు చిరుత భయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.

 • Share this:
  Tiger in Adilabad | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక వైపు చిరుత, మరో వైపు పులి సరిహద్దు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలో పులి హల్ చల్ చేస్తే, నిర్మల్ జిల్లా బెల్తరోడ గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటు కాలం గడుపుతున్నారు. పంటపొలాలు వెళ్ళేందుకు జంకుతున్నారు. మహారాష్ట్రకు సరిహద్దులో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ఇందూర్పల్లి గ్రామ శివారులో అంతర్గామ గ్రామానికి చెందిన గెడం సురేష్ ఆవుపై పులి దాడి చేసి హతమార్చింది. అంతకుముందు ఇదే మండలంలోని కరణ్ వాడి, ఇంద్రనగర్ గ్రామ శివారులో కరణ్ వాడి గ్రామానికి చెందిన సోంజీకి చెందిన ఆవు మృతి చెందింది. వారం రోజుల్లోనే పులి దాడిలో మూడు ఆవులు బలయ్యాయి. గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పులి కదలికలను గుర్తించేందుకు ఐదు సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామస్థులను అప్రమత్తం చేసి ఒంటరిగా తిరగ వద్దని సూచించారు.

  పులి అడుగుజాడలను గుర్తిస్తున్న అటవీశాఖ అధికారులు


  రెండు రోజుల క్రితం నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తరోడ గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు సంచరిస్తున్నట్లు స్థానికులు సంబంధిత అధికారులకు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దుకు అనుకోని ఉన్నబేళ్తారోడా గ్రామ శివారులోని పత్తి చేనుకు కాపాలాగా కట్టి ఉన్న రెండు కుక్కలను చంపితిన్నట్లు రైతులు తెలిపారు. ఆ సంఘటన స్థలానికి వెళ్లి అటవీ అధికారులు పరిశీలించారు. చిరుతపులి, రెండు పిల్లలు వున్నట్లు అధికారులు గుర్తించారు. చేనుకు కాపాలా ఉన్న రెండు కుక్కలను చంపి తింటున్నపుడు చూసి భయాందోళనకు గురై గ్రామానికి పరుగులు తీసినట్లు రైతులు అడవిశాఖ అధికారులకు తెలిపారు. అటవీ శాఖ అధికారులు వాటి పంజా ముద్ర లను కూడా గుర్తించారు. ప్రజలను అప్రమత్తం చేశారు.
  పులి పాదముద్రలు

  మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద అటవీ అధికారులు సకాలంలో స్పందించి మారుమూల గ్రామల ప్రజలకు పులి నుండి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: