తెలంగాణలో ముందస్తు ఎన్నికలు (Telangana Early Polls) ఖామమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గుజరాత్ ఎన్నికలతో (Gujarat Elections) పాటే సీఎం కేసీఆర్ (CM KCR) కూడా ఎన్నికలకు వెళ్లేందుకు స్కెచ్ వేస్తున్నారన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అధికర పక్షంలో కన్నా కూడా ప్రతిపక్షాల్లోనే ఈ చర్చ జోరుగా సాగుతోంది. అంతర్గత సమావేశాల్లో ఆయా పార్టీల నేతలు తమ క్యాడర్ కు ఈ మేరకు దిశానిర్ధేశం సైతం చేస్తున్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని, ఈ మేరకు తమ వద్ద సమాచారం ఉందని పార్టీ శ్రేణులకు ఆయా నాయకులు చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ నేతలు మాత్రం అదేమి ఉండదంటూ కొట్టి పారేస్తున్నారు. అయితే.. తాజాగా బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ వస్తున్న వార్తలపై తనదైన శైలిలో స్పందించారు.
ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కేసీఆర్ కేంద్రంపై కొట్లాట ఆపి రెస్ట్ తీసుకుంటాడన్నారు. ఒక వేళ యూపీ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీకి నష్టం వాటిల్లితే ప్రభుత్వాన్ని రద్దు చేసి గుజరాత్ ఎలక్షన్స్ తో పాటు కేసీఆర్ ఎన్నికలకు వెళ్తాడని జోస్యం చెప్పారు. గుజరాత్ లో ఎన్నికలు జరిగే సమయంలో మోదీ, అమిత్ షా అక్కడే బిజీగా ఉంటారని.. తెలంగాణపై ఆ సమయంలో శ్రద్ధ చూపే అవకాశం వారికి ఉండదన్నది కేసీఆర్ ఆలోచన అని రఘునందన్ వివరించారు.
అయితే యూపీలో తాము ఓడిపోతామన్నది కేసీఆర్ భ్రమ మాత్రమే అని రఘునందన్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వారంలోనే వంద మంది అభ్యర్థులను బరిలో దించి మంచి ఫలితాలను సాధించిన రికార్డు తమకు ఉందని ఆయన గుర్తు చేశారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 23 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని రఘునందన్ రావు వివరించారు. తమ పార్టీలో అభ్యర్థుల కొరత ఉందని సాగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు. ఒక్కో స్థానానికి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారని చెప్పుకొచ్చారు. నాలుగున్న దశాబ్ధాలు పాలించిన కమ్యూనిస్టులను వెస్ట్ బెంగాల్ లో జీరో చేసిన చరిత్ర తమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించడం కేవలం బీజేపీతోనే సాధ్యమని రఘునందన్ రావు అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Raghunandan rao, Telangana bjp, Telangana Election 2018