తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి... రేపటి తొలి దశ పరిషత్‌ పోరుకు సర్వం సిద్ధం...

Parishad Election 2019 : మొత్తం 195 జడ్పీటీసీ, 2,097 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. మొత్తం 62 ఎంపీటీసీ... 2 జడ్పీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 5, 2019, 12:49 PM IST
తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి... రేపటి తొలి దశ పరిషత్‌ పోరుకు సర్వం సిద్ధం...
తెలంగాణలో పరిషత్ పోరు
  • Share this:
Telangana Parishad Election 2019 : తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల తొలి దశ ఎన్నికలు సోమవారం జరగబోతున్నాయి. మొత్తం 2,097 ఎంపీటీసీ... 195 జడ్పీటీసీ స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్నిచోట్లా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఐతే... పోలీస్‌ శాఖ నుంచి వచ్చిన విజ్ఞప్తితో 6 జిల్లాల్లోని 640 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్‌ను సాయంత్రం 4 గంటలకే ముగించాలని తాజాగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీటిలో 217 స్థానాలు మొదటి దశలో ఉన్నాయి. సున్నిత (సెన్సిటివ్) ప్రాంతాలుగా పోలీస్‌ శాఖ చెప్పడం వల్లే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
నియోజకవర్గాలు ZPTC MPTC
మొత్తం స్థానాలు 538 5,817
తొలిదశ పోలింగ్ జరగాల్సినవి 197 2,166
ఏకగ్రీవం అయినవి 2 69
పోలింగ్ జరిగేవి 195 2,097

తెలంగాణలో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పదవులకు పోలింగ్‌ను ఎన్నికల సంఘం మూడు దశల్లో చేపట్టాలని నిర్ణయించింది. తొలి విడత పోలింగ్‌ను సోమవారం జరిపేందుకు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ కారణాల వల్ల వాయిదా పడిన వాటిని తప్పించి... మిగతా 5,817 ఎంపీటీసీల్లో ఎన్నికల్ని నిర్వహిస్తుండగా.. వాటిలో 2,166 స్థానాలు మొదటి దశలో ఉన్నాయి. వాటిలో 69 స్థానాల్లో ఒక్కొక్క నామినేషనే రావడంతో ఆ అభ్యర్థులు ఏకగ్రీవం అయినట్లు రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు.

మిగతా 2,097 స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలవుతుంది. మొత్తం 538 జడ్పీటీసీ స్థానాల్లో మొదటి దశలో 197 ఉండగా... వాటిలో 2 ఏకగ్రీవం అయ్యాయి. అవి తప్ప మిగతా 195 ZPTC స్థానాలకు MPTC స్థానాలతో పాటే పోలింగ్‌ జరపబోతున్నారు. అందువల్ల ఓటర్లు... ముందు ఒక దానికి ఓటు వేసి, వెంటనే రెండో దానికీ ఓటు వేయాల్సి ఉంటుంది.

సెన్సిటివ్ ప్రాంతాల్లో : తెలంగాణలో మొత్తం 640 ఎంపీటీసీ స్థానాలు సున్నిత (సెన్సిటివ్) ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిలో పోలింగ్‌ను సాయంత్రం 4 గంటలకే ముగిస్తారు. అవి భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఉన్నాయి. 640లో 217 ఎంపీటీసీ స్థానాలకు తొలి దశలో పోలింగ్‌ జరగబోతోంది. 4 గంటల తర్వాత పోలింగ్ సిబ్బంది... బ్యాలెట్ బాక్సుల్ని... సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. ఆ తరలింపులో ఇబ్బంది కలగకూడదనే పోలింగ్‌ను త్వరగా ముగిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

ప్రియురాలిని కూడా శ్రీనివాస్ రెడ్డి చంపేశాడా... సైకో కిల్లర్ కేసులో కొత్త కోణం...

Top 10 on Instagram : ఇన్‌స్టాగ్రాంలో టాప్ టెన్ అకౌంట్స్ ఇవే...


చంద్రబాబుకి జగన్ ఇవ్వాలనుకుంటున్న రిటర్న్ గిఫ్ట్ అదేనా... వాటే స్కెచ్...

టీడీపీ ఓడితే ఏపీలో మళ్లీ ఎన్నికలు... చంద్రబాబు వ్యూహం అదేనా... భయపెడుతున్న 20 సర్వేలు...
First published: May 5, 2019, 12:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading