Home /News /telangana /

TELANGANA YOUTH QUESTIONS POLICE FOR NOT WEARING HELMET IN YELLANDU SU

Telangana: ట్రాఫిక్ రూల్స్ మాకేనా.. మీకు వర్తించవా?.. పోలీసులను ప్రశ్నించిన యువకుడు..

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతున్న పోలీసులను ఓ యువకుడు ప్రశ్నించాడు. ట్రాఫిక్ రూల్స్ మాకేనా.. మీకు వర్తించవా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.

    ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు జరిమానా విధించడం చూస్తుంటాం. హెల్మెట్ ధరించని వాహనదారులకు చలాన్లు జారీచేస్తున్న పోలీసులను ఓ యువకుడు ప్రశ్నించాడు. అందుకు కారణం ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్న పోలీసులు.. హెల్మెట్ లేకుండా బైక్స్‌పై తిరగడమే. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటుచేసుకుంది. వివరాలు.. ఇల్లందు పట్టణంలో హెల్మెట్‌ పెట్టుకోని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అయితే బైక్స్‌పై వచ్చిన పోలీసులకు హెల్మెట్ లేని విషయం గమనించిన ఓ యువకుడు తన మొబైల్‌లో వీడియో తీయడం ప్రారంభించాడు. మొబైల్‌ హెల్మెట్ ధరించని పోలీసుతో పాటు, అతను నడుపుతున్న బైక్‌ను కూడా అతడు వీడియో తీశాడు.

    మీరే నిబంధనలు పాటించనప్పుడు.. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ఎలా జరిమానాలు విధిస్తారని పోలీసులను ప్రశ్నించారు. హెల్మెట్ లేకుండా బండి ఎందుకు బయటకు తీసుకొచ్చారని వారితో వాదనుకు దిగాడు. జనాలు హెల్మెట్ లేకుండా బండి నడిపితే ఫొటోలు తీసే మీరు దీనికి ఏం సమాధానం చెబుతారని అడిగాడు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Bhadradri kothagudem, Telangana, Traffic rules

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు