పారిస్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన తెలంగాణ యువకుడు..

ములుగు జిల్లా మంగలపేట మండలం కమలాపురానికి చెందిన కూనూరి సాయిరాం ఏడాదిగా ఫ్రాన్స్‌లో ఉంటున్నాడు. అక్కడి యూనివర్సిటీల ఆఫ్ బోరోడాక్స్‌లో నానో టెక్నాలీపై రీసెర్చ్ చేస్తున్నాడు.

news18-telugu
Updated: August 22, 2019, 10:51 PM IST
పారిస్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన తెలంగాణ యువకుడు..
ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న తెలంగాణ యువకుడు కూనూరి సాయిరాం
  • Share this:
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పారిస్‌లో పర్యటిస్తున్నారు. పారిస్‌లో ప్రధానికి ఘనస్వాగతం లభించింది. అయితే, అక్కడ వారికి స్వాగతం పలికిన వారిలో భారతీయ వ్యాపారులు, స్థానికులతో పాటు ఓ తెలంగాణ యువకుడు కూడా ఉన్నారు. అతడి పేరు కూనూరి సాయిరాం. ఫ్రాన్స్‌లోని విమానాశ్రయంలో పెద్ద పెద్ద వారితో కలసి కూనూరి సాయిరాం ప్రధాని మోదీకి స్వాగతం పలికాడు. తెలంగాణలోని ములుగు జిల్లా మంగలపేట మండలం కమలాపురానికి చెందిన కూనూరి సాయిరాం ఏడాదిగా ఫ్రాన్స్‌లో ఉంటున్నాడు. అక్కడి యూనివర్సిటీల ఆఫ్ బోరోడాక్స్‌లో నానో టెక్నాలీపై రీసెర్చ్ చేస్తున్నాడు. మోదీకి ఆహ్వానం పలికేందుకు రావాల్సిందిగా స్థానిక భారతీయ రాయబార కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. దీంతో అతడు పెద్ద పెద్ద వ్యాపారులు, స్థానికంగా స్థిరపడిన ఎన్ఆర్ఐలతో కలసి వెళ్లి మోదీకి స్వాగతం పలికాడు. ‘మోడీ జి నేను సాయిరాం తెలంగాణ నుండి. మీ లాగే సంఘటన కొరకు నేను జమ్ము కాశ్మీర్ లో పనిచేశాను. ఇప్పుడు నానోటెక్నాలజీ లో రీసెర్చ్ చేస్తున్న. నేను పూర్తి విశ్వాసం తో చెబుతున్న మీ నాయకత్వం లో ఇంకొన్ని రోజుల్లోనే మాతరం డెవలపింగ్ ఇండియా గురించి కాదు డెవలప్డ్ ఇండియా గురించి మాట్లాడుకుంటాం.’ అని మోదీకి స్వాగతం పలికినప్పుడు సాయిరాం చెప్పాడు. ఈ విషయాన్ని అతడు తన ఫేస్ బుక్ ఖాతాలో రాసుకున్నాడు.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు