సెల్ ఫోన్ కొనలేదని ఎంత పనిచేశాడు...?

ప్రశాంత్

23 ఏళ్ల పోతాని ప్రశాంత్ సెల్ కొనివ్వాలంటూ తండ్రిని సత్తయ్యని కోరాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు.

 • Share this:
  సెల్ ఫోన్ పిచ్చితో ఓ యువకుడు తన ప్రాణాలే తీసుకున్నాడు. తల్లిదండ్రులు సెల్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో కలకలం రేపింది. నర్మెట్ట మండలం హన్మంతపూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల పోతాని ప్రశాంత్ సెల్ కొనివ్వాలంటూ తండ్రిని సత్తయ్యని కోరాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రశాంత్ మృతి చెందాడు.

  ప్రశాంత్


  ప్రశాంత్ డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. సెల్ ఫోన్ సరదాతో తండ్రిని కొనివ్వాలంటే.. ఫోన్ కొనివ్వలేదని ప్రశాంత్ పురుగుల మందు తాగి మృతి చెందాడు. దీంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Sulthana Begum Shaik
  First published: