వారం నుంచి డెంగీ జ్వరం.. చేతికి సెలైన్‌తోనే కౌన్సిలింగ్‌కు యువతి

సురేఖకు ఆదివారానికి ప్లేట్‌లెట్ల సంఖ్య ఒక్కసారిగా 44 వేలకు పడిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

news18-telugu
Updated: October 29, 2019, 12:01 PM IST
వారం నుంచి డెంగీ జ్వరం.. చేతికి సెలైన్‌తోనే కౌన్సిలింగ్‌కు యువతి
వారం నుంచి డెంగీ జ్వరం.. చేతికి సెలైన్‌తోనే కౌన్సిలింగ్‌కు యువతి
  • Share this:
తెలంగాణలో డెంగీ జ్వరాలు జనాన్ని పట్టిపీడిస్తున్నాయి. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సురేఖ ఇటీవల వెలువడిన టీఆర్టీ ఫలితాల్లో ఎస్జీటీగా ఎంపికయ్యారు. కౌన్సిలంగ్‌కు టైం దగ్గర పడింది. అయితే సురేఖ గత వారం రోజులుగా డెంగీతో బాధపడుతుంది. సురేఖకు ఆదివారానికి ప్లేట్‌లెట్ల సంఖ్య ఒక్కసారిగా 44 వేలకు పడిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకాగలనో.. లేదో… అని భయపడింది సురేఖ.

సోమవారం ఉదయానికి ప్లేట్‌లెట్లు సంఖ్య మరింతగా తగ్గాయి.19 వేలకు తగ్గిపోవడంతో యువతి తల్లిదండ్రులు మరింత కంగారుపడ్డారు. సురేఖ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో సెలైన్‌ సీసాతోనే మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కౌన్సెలింగ్‌ హాల్‌కు వచ్చింది. ఆత్మకూర్‌ మండలంలోని తిప్పండంపల్లి పాఠశాలను ఎంపిక చేసుకున్న ఆమె..తిరిగి అదే అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళ్లారు.

First published: October 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...