TELANGANA WINE SHOP TENDERS CLOSED AND HUGE RESPOND TO TENDERS VRY
Liqour Tenders : లిక్కర్ టెండర్లలోనే కిక్కు.. అప్లికేషన్స్‌తోనే వందల కోట్లు...
ప్రతీకాత్మక చిత్రం
Liqour Tenders : తెలంగాణ మద్యం టెండర్లలో జోష్ కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2620 షాపులకు గాను, 62వేలకు పైగా మద్యం టెండర్లు దాఖలయ్యాయి. కాగా నిన్న చివరి రోజు కావడంతో యాబై శాతానికి పైగా టెండర్లు వేశారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీకి అనుకూణంగానే మద్యం టెండర్లు ధాఖలయ్యాయి. ప్రభుత్వ అధికారులు ఊహించినట్టుగా వాటికి స్పందన వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మద్యం షాపులకు మొత్తం 62886 టెండర్లు వేశారు. దీంతో ఒక్కో షాపుకు సరాసరి 25 వరకు అప్లికేషన్స్ వచ్చాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ టెండర్ల ద్వారా ప్రభుత్వా ఖాజాను భారీగానే ఆదాయం సమకూరింది . కేవలం టెండర్ అప్లికేషన్స్ ద్వారానే 1200 కోట్ల రూపాయలు వచ్చాయి.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2620 మద్యం షాపులకు టెండర్లను ఆహ్వానించారు. దీంతో గత వారం రోజుల నుండి టెండర్లు వేసేందుకు అవకాశం ఇచ్చిన చివరి చివరి రోజు కంటే ముందు రోజు వరకు మొత్తం టెండర్లలలో కేవలం యాబై శాతం మేర ధరఖాస్తులు వచ్చాయి..కాగా చివరి రోజునే 30వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఇక టెండర్లు ధాఖలు చేయడం కోసం మహిళలతో పాటు చాలా మంది క్యూ లైన్లో వెళ్లి తమ ధరఖాస్తులను ఇచ్చారు. టెండర్లను శనివారం ఓపెన్ చేయనున్నారు.
ఇక తెలంగాణలోని సరిహద్దు జిల్లాల్లో మద్యం దుకాణాలకు డిమాండ్ ఎక్కువగా వచ్చింది. ముఖ్యంగా ఒక్క షాపుకు ఒక్కరు ఎన్ని అప్లికేషన్స్ అయినా వేసుకునే అవకాశం కల్పించడంతో పాటు ఇతర రాష్ట్రాల వారికి కూడా టెండర్లలో అవకాశం ఇవ్వడంతో ఏపీ వాసులు అధికంగా టెండర్లలో పాల్గొన్నట్టు సమాచారం.. దీంతో అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లాలో ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చాయి.. దీంతో సరిహద్దు జిల్లాలైన సూర్యపేట, నల్గొండ, గద్వాల జిల్లాలతోపాటు అధికంగా ఖమ్మం జిల్లాలో మద్యం టెండర్లు వేశారు.. ఖమ్మంలో 122 షాపులకు గాను 6214 ధరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లా సరాసరిగా ఒక్కో షాపుకు 50 ధరఖాస్తులు వచ్చాయి. మిగతా జిల్లాల్లో సరాసరి ఒక్కోషాపుకు 25 నుండి ముప్పై అప్లికేషన్లు వచ్చాయి.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం మద్యం టెండర్లలలో రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే.. దీంతో గత సంవత్సరం కంటే అదనంగా 404 దుకాణాలను కేటాయించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల సంఖ్య 2620కి చేరుకుంది. కాగా శనివారం టెండర్లు ఓపెన్ చేసిన అనంతరం మద్యం డిపాజిట్‌కు మరో రెండు రోజుల మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇక కొత్త షాపులను డిశంబర్ ఒకటి నుండి ఏర్పాటు చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.