Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసులో ఈ నెల 9న విచారణకు రావాలని కేసీఆర్ తనయ, టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్) నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(MLC Kavitha) ఈడీ నోటీసులు జారీ చేసింది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు కవిత ఇప్పటికే పిలుపునిచ్చారు. అయితే ధర్నా ముందు రోజే అంటే రేపే ఢిల్లీలో ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని ఈడీ కవితకు తాజాగా ఇచ్చిన నోటీసుల్లో తెలిపింది. అయితే ఈడీ నోటీసులపై ట్విట్టర్ వేదికగా కవిత స్పందించారు. తెలంగాణ తల వంచదు అంటూ ట్విట్టర్ లో ఓ ప్రకటన విడుదల చేశారు కవిత.
కవిత తన ప్రకటనలో.."రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది; రాజకీయ భాగస్వామ్యంలో మహిళలకు సముచిత భాగస్వామ్యాన్ని కల్పించేందుకు దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా ఏకైక డిమాండ్. బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ మార్చి 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఒక రోజు శాంతియుత నిరాహార దీక్ష కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు మరియు మహిళా సంఘాలతో పాటు భారత్ జాగృతి కలిసి వస్తుంది. ఈ సంఘటనల నేపథ్యంలో, మార్చి 9న న్యూఢిల్లీలో హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నాకు సమన్లు పంపింది. చట్టాన్ని గౌరవించే సిటిజన్ గా, నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తాను. అయితే, ధర్నా మరియు ముందస్తు నియామకాల కారణంగా, నేను దానికి హాజరయ్యే తేదీపై న్యాయపరమైన అభిప్రాయాలను కోరతాను. మా అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ పోరాటానికి, గొంతుకు వ్యతిరేకంగా, మొత్తం బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ బెదిరింపు వ్యూహాలు మమ్మల్ని అడ్డుకోలేవని కేంద్రంలోని పార్టీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో, మేము మీ వైఫల్యాలను బహిర్గతం చేయడానికి మరియు భారతదేశానికి ఉజ్వలమైన మరియు మెరుగైన భవిష్యత్తు కోసం వాయిస్ పెంచడానికి పోరాడుతూనే ఉంటాము. అణచివేత వ్యతిరేక ప్రజల ముందు తెలంగాణ ఎన్నడూ తలవంచలేదు అని ఢిల్లీలో ఉన్న అధికారదాతలకు గుర్తు చేస్తున్నాం. పాలన. హక్కుల కోసం నిర్భయంగా, ఉధృతంగా పోరాడుతాం"అని తెలిపారు.
తెలంగాణ తల వంచదు Ahead of our March 10 dharna along with the opposition parties and women organisations demanding the Women's Reservation Bill at Jantar Mantar, I have been summoned by the ED on March 9th. My statement : pic.twitter.com/DWbNuNNpnP
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 8, 2023
కాగా,ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాతో పాటు పలువురు ప్రముఖులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మొత్తం 11మందిని ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్ట్ తర్వాత ఇటీవల డిప్యూటీ సీఎం పదవికి మనీష్ సిసోడియా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారిని ఇప్పటికే ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు కవిత. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు కవితను విచారించారు. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు,ఢిల్లీ లిక్కర్ స్కామ్ఈ కేసులో కీలక వ్యక్తి అయిన రామచంద్ర పిళ్లైని నిన్న అధికారులు అరెస్ట్ చేశారు. అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ..విచారణలో ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. ఈ స్కామ్‌లో కవితకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.