తెలంగాణలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి..

ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం అల్పపీడనం ఏర్పడింది.

news18-telugu
Updated: August 13, 2020, 10:07 PM IST
తెలంగాణలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి..
Rain Alert : తెలంగాణకు భారీ వర్షసూచన
  • Share this:
ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వలన ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధముగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని సమాచారం. ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం -ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీవర్షం కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 13, 2020, 10:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading