హోమ్ /వార్తలు /తెలంగాణ /

Weather: రెడ్, ఆరెంజ్, యెల్లో అలర్ట్స్‌కి అర్థమేంటి? వాతావరణశాఖ ఎప్పుడు జారీచేస్తుంది?

Weather: రెడ్, ఆరెంజ్, యెల్లో అలర్ట్స్‌కి అర్థమేంటి? వాతావరణశాఖ ఎప్పుడు జారీచేస్తుంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Weather Updates: ఆరెంజ్ అలర్ట్‌కి అర్ధమేంటి? యెల్లో అలర్ట్ ఎప్పుడు ఇస్తారు? రెడ్ అలర్ట్ వస్తే అంతే సంగతులా..? వీటిని వాతావరణశాఖ ఏ సమయంలో జారీ చేస్తుంది? మనం ఏ రంగు వార్నింగ్‌ వచ్చినప్పుడు అప్రమత్తమవ్వాలి?

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని వాతావరణశాఖ (IMD) తెలిపింది. అంతేకాదు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్  కూడా జారీ చేసింది. ఐతే ఈ ఆరెంజ్ అలర్ట్‌కి అర్ధమేంటి? యెల్లో అలర్ట్ ఎప్పుడు ఇస్తారు? రెడ్ అలర్ట్ వస్తే అంతే సంగతులా..? వీటిని వాతావరణశాఖ ఏ సమయంలో జారీ చేస్తుంది? మనం ఏ రంగు వార్నింగ్‌ వచ్చినప్పుడు అప్రమత్తమవ్వాలి?

  సాధారణంగా బాగా వర్షాలు కురుస్తున్న సమయంలో వాతావరణశాఖ పసుపు (Yellow Alert) , నారింజ (Orange Alert) , ఎరుపు రంగు (Red Alert) వార్నింగ్స్‌ ఇస్తుంటుంది .  వాతావరణ పరిస్థితుల తీవ్రతను తెలియజేయడానికి భారత వాతావరణ శాఖ (IMD) రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. ఇలా రంగుల రూపంలో చెబితే ఎక్కువమందికి సులభంగా విషయం అర్థమవుతుందనేది దీని ఉద్దేశం. దానికి తగ్గట్టుగా తర్వాతి పరిస్థితిని అర్థం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. తొలి రోజుల్లో ఆకుపచ్చ రంగు, పసుపు, నారిజం, ఎరుపు అంటూ నాలుగు రకాల రంగులు వాడేవారు. ఆకుపచ్చ అంటే ఎలాంటి చర్యలు అవసరం లేదని, పసుపు అంటే సిద్ధంగా ఉండమని, నారింజ అంటే సంసిద్ధులుకండి అని, ఎరుపు అంటే చర్యలు తీసుకోమని అర్థం.

  Telangana Rains: తెలంగాణలో ఇవాళ, రేపు కుండపోత వానలు... ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

  ఈ రంగుల కేటాయింపును ఐఎండీ ఐదు రోజుల వాతావరణ స్కీమ్‌ ఆధారంగా నిర్ణయిస్తూ ఉంటుంది. మెట్రోలాజికల్‌ అంశాలు, హైడ్రోలాజికల్‌ అంశాలు, జియోఫిజికల్‌ ఫ్యాక్టర్స్‌ పరిగణలోకి తీసుకొని వర్షాల తీవ్రతను అంచనా వేసి అందుకుతగ్గ రంగు హెచ్చరికలు జారీ చేస్తారు. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఇదే కలర్‌ కోడ్‌ను వినియోగిస్తారు. అయితే ఆ హెచ్చరికతో పాటు ఇచ్చే సబ్‌ డివిజనల్‌ హెచ్చరిక మాత్రం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది.

  ఆకుపచ్చ రంగు

  వర్షం పడే అవకాశం లేని సమయాల్లో వాతావరణ శాఖ ఆకుపచ్చ రంగును చూపిస్తుంది. అంటే అది ఆటోమేటిక్‌గా ఉంటుందన్నమాట. వర్షం పడే సూచనలు ఉంటేనే ఆకుపచ్చ నుంచి రంగు మారుతుంది.

  Hyderabad: ఇతర రాష్ట్రాల సీఎంలను గౌరవించలేని KCR కి జాతీయ పార్టీనా? : బండి సంజయ్​

  పసుపు అలర్ట్ (Yellow Alert) 

  ఎల్లో అలర్ట్ అంటే ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇస్తారు. డేంజర్ రాబోతోందని సూచనగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అంటే దాని ఉద్దేశం అలర్ట్ గా ఉండమని చెప్పడం. 7.5 మి.మీ నుంచి 15 మి.మీ మధ్య వర్షపాతం సుమారు గంట నుంచి రెండు గంటల వరకు పడే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్ ఇస్తారు.

  ఆరెంజ్ అలర్ట్ (Orange Alert)

  ఎల్లో అలర్ట్ అనేది ఆరెంజ్ అలర్ట్‌గా మారుతుంది. వాతావరణ పరిస్థితులు మరింత దిగజారినప్పుడు ఆరెంజ్ అలర్ట్ ఇస్తారు. వర్షాల వల్ల రోడ్డు రవాణా, విమానాల రాకపోకలకు అంతరాయం, ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉన్న సమయాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు.

  రెడ్ అలర్ట్ (Red Alert) 

  రెడ్ అలర్ట్ అంటే డేంజర్ పరిస్థితి. సహజంగా తుఫాన్లు వచ్చినప్పుడు, 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయనే అంచనా ఉన్నప్పుడు వాతావరణ శాఖ అధికారులు ఇలా రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణం డేంజర్ లెవల్స్ దాటినప్పుడు, ఎక్కువ నష్టం జరుగుతుందని భావించినప్పుడు రెడ్ అలర్ట్ ఇష్యూ చేస్తారు.

  అది కూడా  30 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం రెండు గంటల కంటే ఎక్కువ సమయం కురుస్తుందని అంచనా వేసినప్పుడు ఇలాంటి రెడ్ అలర్ట్స్ జారీ అవుతాయి. దీంతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులను కూడా దీనికి తగినట్టు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెబుతారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన సమయం ఇది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Heavy Rains, Hyderabad, IMD, Imd hyderabad

  ఉత్తమ కథలు