Telangana Rains | తెలంగాణకు మరో రెండు రోజులు వర్షసూచన

Rain Alert : తెలంగాణకు మోస్తరు వర్షసూచన

Telangana Rain Alert | రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

  • Share this:
    Telangana Wether Report | తూర్పు మధ్యప్రదేశ్ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లి కొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉన్నది. ఇది క్రమంగా రాగల 3, 4 రోజులలో పశ్చిమ దిశగా పశ్చిమ మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. తూర్పు-పశ్చిమ shear zone Lat.22.0 deg.N వెంబడి మధ్య భారతదేశం మీదుగా 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 23న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, జనగామ, మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ , సూర్యాపేట జిల్లాలలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: