Rain alert: తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

ఈశాన్య మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 2.1 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది

news18-telugu
Updated: August 10, 2020, 4:25 PM IST
Rain alert: తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జలాశయాలన్నీ నిండు కుండుల్లా కళకళలాడుతున్నాయి. మరిన్ని రోజులు ఈ వర్షాలు కురిసే అవకాశముంది. రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈశాన్య మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 2.1 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఆగస్టు 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.
Published by: Shiva Kumar Addula
First published: August 10, 2020, 4:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading