తెలంగాణకు మూడు రోజుల వర్షసూచన...

తెలంగాణకు రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

news18-telugu
Updated: July 15, 2020, 5:05 PM IST
తెలంగాణకు మూడు రోజుల వర్షసూచన...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణకు రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో 1.5 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. తెలంగాణలో ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు రేపు చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వికారాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. పలు చోట్ల లోలెవల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పంటచేలల్లోకి వరద నీరు చొచ్చుకుపోయింది. సరిహద్దులోని పెన్ గంగా నదిలోకి వరద నీరు వచ్చి చేరటంతోపాటు ఎగువ ప్రాంతంలో కురుస్తున్నవర్షానికి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. జైనథ్ మండలం పూసాయి గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ గ్రామంలోని ఎల్లమ్మ గుడి జలదిగ్భందనమైంది. నార్నూరు మండలం మహాగావ్ వంతెనపై నుంచి వరద ప్రవహించడంతో నార్నూర్ గాదిగూడ మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్, తాంసి, భీంపూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, సిరికొండ, బోథ్, బజార్ హత్నూర్ వర్షం కురియడంతో గ్రామ సమీపంలోని ఒర్రెలు పలు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. మరోవైపు ఈ వర్షంతో పంటలకు జీవం పోసినట్లైంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 15, 2020, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading