తెలంగాణ వెదర్ రిపోర్ట్... 3 రోజుల పాటు వడగాల్పులు ఉండే జిల్లాల వివరాలు..

రాయలసీమలోనూ వాతావరణం దాదాపు ఇదే రకంగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఛత్తీస్ గఢ్ నుంచి మధ్య తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

  • Share this:
    తెలంగాణలో రాగల మూడు రోజుల వరకు వెదర్ రిపోర్టును హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుంది. అయితే, ఈరోజు, రేపు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ తీవ్ర వడగాల్పులు, కొన్ని చోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎల్లుండి (మే 26) ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్నిచోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

    మరోవైపు ఛత్తీస్ గఢ్ నుంచి మధ్య తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్ గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ నుంచి 3.1 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: