శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని (Hyderabad Rains) ముంచెత్తింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. చిన్న చినుకులుగా మొదలైన వర్షం.. ఆ తర్వాత కొద్ది సేపట్లోనే జడివానగా మారింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా కుండపోత వాన కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా నాలుగు గంటల పాటు వర్షం పడడంతో.. ఆయా కాలనీల్లో మోకాల్లోతు నీరు నిలిచిపోయింది. రహదారులు చెరువులను తలపించాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. ముఖ్యంగా షేక్‌పేట్, అత్తాపూర్, హైటెక్ సిటీ, మదాపూర్, గచ్చిబౌలి, జూబిలీహిల్స్, మియాపూర్ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ఉపరితల ద్రోణి, క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో ఊహించని స్థాయిలో వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయమంతా ఎండగానే ఉన్నా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం (Hyderabad Weather) మారిపోయింది. భారీ వర్షం పడడంతో హైదరాబాద్ వాసులు వణికిపోయారు. గరిష్టంగా షేక్‌పేటలో 13.6 సెంటీమీటర్లు, కాకతీయ హిల్స్‌లో 12.7, మాదాపూర్‌లో 12.1, జూబిలీహిల్స్‌లో 11.3, హైదర్‌నగర్‌లో 11, గచ్చిబౌలిలో 9.7, మియాపూర్‌లో 8.1 సెం.మీ. వర్షపాతం కురిసింది.
హైదరాబాద్‌లో వర్ష బీభత్స దృశ్యాలు:
ముసాపేట మెట్రో స్టేషన్ వద్ద చెరువును తలపిస్తున్న రహదారి
#HyderabadRains #hyderabad under moosapet metro station … water levels crossed door height of the car.. somehow waded through it safely.. ve safe hyderabad. pic.twitter.com/FcLKw2ExJ3
— Praneet Pyati (@andypraneet) October 8, 2022
అత్తాపూర్ ఏరియాలో రోడ్డు నిలిచిన వరద నీరు
Every time after heavy rain this road under PVNR Expressway turns into rivulet, today also same #Waterlogging due to #heavyrains at Upperpally near Attapur area in #Hyderabad traffic interrupts#HyderabadRains @GadwalvijayaTRS @Director_EVDM @DRFEVDM @HMWSSBOnline @MinisterKTR pic.twitter.com/0syiJ5dWth
— i am modi (@ashwin_modi007) October 8, 2022
మూసాపేటలో వర్ష బీభత్సం
Moosapet Every year same situation is repeating here due to heavy rains. Find a permanent solution sir. @KTRTRS @TelanganaCMO pic.twitter.com/HozAfpcdrc — Hareesh (@HAREESHHARI11) October 8, 2022
మూసాపేటలో నీట మునిగిన కాలనీ
#HyderabadRains #Telanganarains #TelanganaWithKCR @TelanganaCMO@TelanganaToday @TelanganaDGP Heavy rains fall in Hyderabad Moosapet area.Many times complaining but no response from anyone.???????????????????? pic.twitter.com/BGuURIRBMB
— Sarath Kumar Addala (@SarathAddala) October 8, 2022
పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే వద్ద వరద నీటిలో ప్రయాణికుల అవస్థలు
Again after just hour long rainfall #PVNRExpressway turns into rivulet.
#waterlogging #HyderabadRains #Hyderabad #SinkingHyderabad #floods pic.twitter.com/6lh8bRcCPg — Hyderabad You Deserve (@HydYouDeserve) October 8, 2022
తెలంగాణలో ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సిటీలోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, IMD, Imd hyderabad, Telangana rains