హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : ఉర్సు ఉత్స‌వాల్లో ఘ‌ర్ష‌ణ‌.. ఇద్ద‌రి మృతి.. ఏడుగురి గాయాలు.. రంగంలోకి పోలీసు బ‌ల‌గాలు

Telangana : ఉర్సు ఉత్స‌వాల్లో ఘ‌ర్ష‌ణ‌.. ఇద్ద‌రి మృతి.. ఏడుగురి గాయాలు.. రంగంలోకి పోలీసు బ‌ల‌గాలు

గ్రామాన్ని ప‌రిశీలిస్తున్న పోలీస్ బృందం

గ్రామాన్ని ప‌రిశీలిస్తున్న పోలీస్ బృందం

Tealangana : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండాల గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇరువురు మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసు బ‌ల‌గాలు రంగంలోకి దిగాయి.

  ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఇచ్చోడ మండలం గుండాల గ్రామంలో జరిగిన ఉర్సు ఉత్సవాల్లో గ్రామంలోని ఒకే వర్గానికి చెందిన ఇరు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు మహిళలతోపాటు ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ (Hyderabad) కు తరలించారు. అయితే ఘర్షణ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు (Police) హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

  ఆసిఫాబాద్ జిల్లాల నుంచి అదనపు బలగాలు..

  గ్రామంలో 12 పికెటింగులను ఏర్పాటు చేసి బందోబస్తును పటిష్టం చేశారు. పొరుగు గ్రామాల నుంచి గుండాల గ్రామంలోకి ఎవరిని కూడా అనుమతించలేదు. సమాచారం అందుకున్న ఆదిలాబాద్ ఎస్.పి రాజేష్ చంద్రతోపాటు నిర్మల్ ఎస్.పి సి.హెచ్. ప్రవీణ్ కుమార్ గుండాలకు గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించి గుండాల గ్రామాన్ని పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు.

  Huzurabad By-election 2021 : గ‌ల్లీల్లో గస్తీ తిరగండి.. తెచ్చిన సొమ్ము గుంజుకోండి : రేవంత్‌రెడ్డి


  మరోసారి ఘర్షణ తలెత్తకుండా చర్యలు చేపట్టారు. గత సంవత్సరం కూడా ఇలాగే ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణకు రాజకీయ కక్ష కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గుండాల గ్రామ సర్పంచ్ షేక్ రషీద్ ఒక వర్గానికి నాయకత్వం వహిస్తుండగా,  మరో వర్గానికి ఎంపీటీసీ కుటుంబానికి చెందిన షేక్ మోబీన్ నాయకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ ఇరువర్గాల మధ్య గత కొంతకాలంగా రాజకీయ కక్షలు కొనసాగుతున్నాయి.

  ఏం జ‌రిగింది..

  సర్పంచ్ షేక్ రషీద్ ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాల సందర్భంగా డిజె సౌండ్ బాక్స్ లతో గ్రామంలో ఉత్సవం జరుపుకొంటున్న క్రమంలో షేక్ మొబీన్ వర్గీయులు అడ్డు వచ్చి అనుమతి లేని ఉర్సు ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నారని నిలదీశారు.  దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ ప్రారంభమైంది. మోబిన్ వర్గీయులు అనుమతి లేకుండా డిజె సౌండ్ బాక్స్ తో ఉర్సు ఉత్సవాలు జరుపుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందించడంతో, సర్పంచ్ వర్గీయులు ఉత్సవాలను అడ్డుకోవడంతో పాటు పోలీసులకు సమాచారం ఇస్తారా అంటూ కోపోద్రిక్తులై మోబీన్ వర్గీయులపై గొడ్డలి, కత్తులు, కర్రలతో  దాడులు చేశారు.  ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు.

  VC Sajjanar : ఆర్టీసీలోనే నైతిక విలువలు.. మెట్రో సంఘటనతో వీడియో పోస్ట్ ..


  అనుమానితుల‌ను అదుపులోకి..

  ఈ నేపథ్యంలో ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఇరువర్గాలకు చెందిన ముగ్గురు మహిళలతో పాటు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిర్వహించడానికి బోథ్ ఆస్పత్రికి తరలించారు. ఇచ్చోడ పోలీసులు క్షతగాత్రులను చికిత్సకోసం రిమ్స్ ఆదిలాబాద్ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఇరువర్గాల మధ్య మరింత ఘర్షణ తలెత్తకుండా అడ్డుకున్నారు. వచ్చి రావడంతోనే అల్లరి మూకలను చెదరగొట్టి ఇరువర్గాలను శాంతింప జేసి ఘర్షణకు గల కారణాలను లోతుగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన ఇండ్లు దెబ్బతిన్నాయని, దర్యాప్తు చేసి నాలుగు కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటివరకు ఘర్షణకు సంబంధించిన 23 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే వరకు సాయుధ పోలీసుల పికెటింగ్ కొనసాగుతుందని తెలిపారు.

  - క‌ట్ట లెనిన్‌, ఆదిలాబాద్‌, న్యూస్‌18 తెలుగు

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Adilabad, Telangana News

  ఉత్తమ కథలు