Home /News /telangana /

TELANGANA TWO CHILDREN DIED WHILE SWIMMING IN PEDDAPALLI DISTRICT SU KNR

Telangana: ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి.. నీరుకుళ్లలో విషాదఛాయలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అభం.. శుభం.. ఎరుగని చిన్నారులను విధి చిన్నచూపు చూసింది. సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు మృతిచెందారు.

    అభం.. శుభం.. ఎరుగని చిన్నారులను విధి చిన్నచూపు చూసింది. సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు మృతిచెందారు. దీంతో ఆ చిన్నారుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ళలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నీరుకుళ్ళ గ్రామానికి చెందిన కొత్తపల్లి అనిల్(13) కరీంనగర్‌లో ఉంటున్నాడు. మేనత్త సంవత్సరికం ఉండటంతో శుక్రవారం నీరుకుళ్ళకు వచ్చారు. మరో బాలుడు కొత్తపల్లి రాంచరణ్ నీరుకుళ్ళలోనే ఉంటున్నాడు . సాయంత్రం 3 గంటల ప్రాంతంలో చిన్నారులు ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళారు. అయితే రాత్రి అయినా కూడా వారిద్దరు తిరిగి ఇళ్లకు చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమ పిల్లలు కనిపించకపోవడంపై గ్రామస్థులకు చెప్పడంతో.. వారు కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.

    అయితే గాలింపు చర్యలు చేపట్టిన వారికి నీరుకుళ్ళ‌లోని మానేరు వాగులో చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. స్థానికులు ఎస్సైకి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిరుపేద చాకలి వృత్తి చేసుకుంటున్న కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను , జిల్లా అధికారులను కోరుతున్నారు..
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Peddapalli, Swimming, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు