హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఆనందయ్య మందుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Telangana: ఆనందయ్య మందుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Anandayya Medicine: కళ్ళల్లో ఆనందం మందు వేస్తే కళ్ళకు ప్రమాదం, కళ్ళ మంట తప్ప కరోనా పోదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Anandayya Medicine: కళ్ళల్లో ఆనందం మందు వేస్తే కళ్ళకు ప్రమాదం, కళ్ళ మంట తప్ప కరోనా పోదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Anandayya Medicine: కళ్ళల్లో ఆనందం మందు వేస్తే కళ్ళకు ప్రమాదం, కళ్ళ మంట తప్ప కరోనా పోదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

  ఆంధ్రప్రదేశ్‌లో కరోనాపై ఎంతగా చర్చ జరుగుతుందో... కృష్ణపట్నం ఆనందయ్య మందుపై కూడా అంతేస్థాయిలో చర్చ జరుగుతోంది. తాజాగా ఆనందయ్య మందుపై జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణపట్నం ఆనందయ్య మందు కరోనాను నయం చేసేలా పని చేస్తే ఆయనకు పాదాభివందనం చేస్తానని సంజయ్ కుమార్ అన్నారు. కళ్ళల్లో ఆనందం మందు వేస్తే కళ్ళకు ప్రమాదం కళ్ళ మంట తప్పక కరోనా పోదని ఆయన వ్యాఖ్యానించారు. ఆనందయ్య మందు పని చేస్తే కరోనా వ్యాధి గ్రస్తులకు ఆ మందు పంపిణీ చేయచ్చని సూచించారు. అనవసరమైన మూఢనమ్మకాలకు పోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

  ఇక ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ తొలి దశ అధ్యయనం పూర్తయ్యింది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు రెస్ట్రోపెక్టివ్ స్టడీని ఆయుర్వేద వైద్యులు చేసిన నివేదిక అందజేశారు. మందు తీసుకున్న 570 మందిని ఫోన్లో సంప్రదించిన వైద్యులు.. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. మలిదశ ప్రయోగాలకు అవసరమైన అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. సీసీఆర్ఏఎస్ తదుపరి ఆదేశాలు అందిన వెంటనే తర్వాతి రెండో దశ ప్రయోగాలు ప్రారంభించనున్నారు. సుజన్‌ ల్యాబ్‌లో జంతువులపై ప్రీ క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. సుజన్‌ లైఫ్ ల్యాబ్‌ నుంచి 15 రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది.

  TRS MLS Sanjay Kumar news, TRS MLS Sanjay Kumar corona virus, telangana news, covid 19, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా వైరస్, తెలంగాణ న్యూస్, కోవిడ్ 19
  టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (ఫైల్ ఫోటో)

  ఆనందయ్య మందుపై మరో రెండురోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు టీటీడీ పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పటికే ఆనందయ్య కుటుంబంతో మాట్లామన్న చెవిరెడ్డి.. మందుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఈ ఔషధం పట్ల పాజిటివ్ రిపోర్ట్ వస్తే మందు తయారీ, పంపిణీకి ముద్ధ ప్రతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

  ఇక ఆనందయ్య మందును ప్రజలకు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయుష్‌ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు ఆనందయ్య మందు నమూనాలు సేకరించి తమ అభిప్రాయం చెప్పారు. అయితే పూర్తి స్థాయి నివేదిక‌లు వ‌చ్చే వ‌రకు ప్రభుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసింది.

  First published:

  Tags: Anandaiah corona medicine, Telangana, Trs

  ఉత్తమ కథలు