Home /News /telangana /

TELANGANA TRIBALS CONGRATULATES KANAKARAJU WHO WAS HONOURED WITH PADMA SHRI BA ADB

Padma Shri Kanakaraju: తెలంగాణ కళాకారుడు కనకరాజుకు పద్మశ్రీ... ఉప్పొంగుతున్న గిరిజనం

కనకరాజుకు అభినందనలు చెబుతున్న అధికారులు

కనకరాజుకు అభినందనలు చెబుతున్న అధికారులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన కళాకారుడికి అరుదైన గౌరవం లభించింది. ఆదివాసి గిరిజన సంప్రదాయ గుస్సాడి నృత్య శిక్షకుడు కనక రాజును పద్మశ్రీ పురస్కారం వరించింది. 2021 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం కళారంగంలో కనక రాజును ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.

ఇంకా చదవండి ...
    (కట్టా లెనిన్, ఆదిలాబాద్ కరస్పాండెంట్, న్యూస్‌18)

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన కళాకారుడికి అరుదైన గౌరవం లభించింది. ఆదివాసి గిరిజన సంప్రదాయ గుస్సాడి నృత్య శిక్షకుడు కనక రాజును పద్మశ్రీ పురస్కారం వరించింది. 2021 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం కళారంగంలో కనక రాజును ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఆదివాసి గిరిజనులు ఉప్పొంగిపోతున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనక రాజు ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలు, కళలపై పట్టున్న కళాకారుడు. గిరిజన సంప్రదాయ గుస్సాడి నృత్య శిక్షకుడు కనక రాజు గత 50 సంవత్సరాలుగా ఆదివాసీల అరుదైన కళ గుస్సాడికి ప్రాణం పోస్తూ వందలాదిమంది గుస్సాడి కళాకారులను తయారు చేశారు. వయసుతో సంబంధం లేకుండా వాయిద్యాలు తయారు చేయడం, కాలి గజ్జెల అల్లికల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా వాటిలో ప్రావీణ్యం కూడా పొందారు. 1981లో ప్రధాని ఇందిరా గాంధీ, రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ ఎదుట గుస్సాడీ కళాకారులతో డిల్లీలో ప్రదర్శన ఇచ్చారు.

    ఇదిలా ఉంటే మారుమూల గిరిజన గ్రామం నుంచి అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన కనక రాజును కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన గణంతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మేల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సత్కరించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, అటవీ పర్యావరణం దేవాదాయ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఫోన్ చేసి రాజును అభినందించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా రాజుకు అభినందలు తెలిపారు. జాతీయ స్థాయిలో ఓ ఆదివాసి గిరిజన కళాకారుడికి అరుదైన గౌరవం లభించడంతో అడవుల జిల్లా, ఆదివాసీల ఖిల్లా అయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 119 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. పద్మ విభూషణ్ (7), పద్మ భూషణ్ (10), 102 మందికి పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం నలుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణలో ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఏపీకి చెందిన అన్నవరపు రామస్వామికి పద్మశ్రీ (Arts), ఏపీకి కి చెందిన అశావాది ప్రకాశ్‌రావుకు పద్మశ్రీ (Literature), ఏపీకి చెందిన నిడుమోలు సుమతికి పద్మశ్రీ (Arts), తెలంగాణకు చెందిన కనకరాజుకు పద్మశ్రీ(Arts) పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Padma Awards, Padma Shri, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు