ఏం జరుగుతోంది... ఆర్టీసీ సమ్మెపై గవర్నర్‌ ఆరా

తెలంగాణ ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలపై వివరించేందుకు గవర్నర్ తమిళిసైతో రవాణాశాఖ కార్యదర్శి భేటీ అయ్యారు.

news18-telugu
Updated: October 17, 2019, 8:59 PM IST
ఏం జరుగుతోంది... ఆర్టీసీ సమ్మెపై గవర్నర్‌ ఆరా
గవర్నర్ తమిళిసై, ఆర్టీసీ ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలపై వివరించేందుకు గవర్నర్ తమిళిసైతో రవాణాశాఖ కార్యదర్శి సునీల్ శర్మ భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన రవాణాశాఖ కార్యదర్శిని గవర్నర్ దగ్గరకు పంపించి వివరణ ఇచ్చారని సమాచారం. త్వరలోనే సమ్మె, తదనంతర పరిణామాలు వివరించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రెండు రోజుల ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసిన గవర్నర్ తమిళిసై... రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె అంశంపైనే వారికి నివేదిక ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు గవర్నర్‌ను కలిసి బీజేపీ నేతలు ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫిర్యాదు చేశారు. ఈ అంశాలన్నింటి నేపథ్యంలో గవర్నర్ తమిళిసైతో రవాణాశాఖ కార్యదర్శి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading