హోమ్ /వార్తలు /తెలంగాణ /

బస్సుల్లో కరోనా నివారణ చర్యలేవీ? ఆర్టీసీ అధికారులపై మంత్రి ఆగ్రహం

బస్సుల్లో కరోనా నివారణ చర్యలేవీ? ఆర్టీసీ అధికారులపై మంత్రి ఆగ్రహం

సూర్యాపేట జిల్లా రీజినల్ మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు మంత్రి. కండక్టర్‌కు శానిటైజర్‌ను అందించని డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

  తెలంగాణలో నిన్నటి నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఐతే బస్సుల్లో కరోనా నివారణ చర్యలు అమలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్సులో శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం చెప్పినా.. చాలా బస్సుల్లో అది కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఖమ్మంలోని పలు ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ తనిఖీ చేశారు. కోదాడ డిపోకు చెందిన ఓ బస్సులో

  కండక్టర్ వద్ద శానిటైజర్ లేకపోవడంపై ఆయన ప్రశ్నించారు. డిపోలో ఇవ్వలేదని కండక్టర్ సమాధానం ఇవ్వడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సూర్యాపేట జిల్లా రీజినల్ మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు మంత్రి. కండక్టర్‌కు శానిటైజర్‌ను అందించని డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

  ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడుస్తున్నప్పటికీ.. సిటీ బస్సులకు మాత్రం అనుమతి లేదు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు నగరం లోపలికి వెళ్లవు. JBSకి మాత్రం వస్తాయి. ఆర్టీసీ బస్సులన్నీ రాత్రి 7 కల్లా డిపోలకు చేరాల్సి ఉంటుంది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే. సోషల్ డిస్టాన్సింగ్ అమలయ్యేలా బస్సుల్లో తగిన ఏర్పాట్లు చేశారు. ఇకపై బస్సుల్లో నిల్చొని ప్రయాణించడం అన్నది ఉండదు. అన్ని సీట్లలోనూ ప్రయాణికుల్ని కూర్చోనిస్తారు. సీట్ల మధ్య గ్యాప్ ఏమీ లేదు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు వెళ్లవు. ప్రస్తుతానికి టికెట్ల పెంపు లేదని ప్రభుత్వం తెలిపింది.

  First published:

  Tags: Lockdown, Puvvada Ajay, Rtc, Telangana, Tsrtc

  ఉత్తమ కథలు