Home /News /telangana /

TELANGANA TRANSPORT MINISTER COMMENTS ON RTC DRIVER SRINIVAS REDDYS SUICIDE BS

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై స్పందించిన మంత్రి పువ్వాడ..

పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్ ఫొటో)

పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్ ఫొటో)

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పదో రోజుకు చేరుకుంది. టీఆర్‌ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు లేఖతో ఆర్టీసీ కార్మికులు మరోసారి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. అయితే, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు ప్రతీ ఒక్కర్ని కలచి వేస్తున్నాయి. రెండ్రోజుల కిందట ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. 90 శాతం కాలిన గాయాలతో హైదరాబాద్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా.. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
    ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై స్పందించిన మంత్రి పువ్వాడ

    ప్రకటనలో.. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యను మృతిగా పేర్కొన్న మంత్రి.. డ్రైవర్ మృతికి సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపారు. ‘ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. వారి మృతి నన్ను తీవ్రంగా కలిచివేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని తెలిపారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: CM KCR, Hyderabad, Rtc, Rtc jac, Tsrtc, TSRTC Strike

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు