Home /News /telangana /

ఖమ్మంలో కారు ఓవర్ స్పీడ్‌... హైదరాబాద్‌లో బైక్‌కు చలానా

ఖమ్మంలో కారు ఓవర్ స్పీడ్‌... హైదరాబాద్‌లో బైక్‌కు చలానా

కారు, బైక్

కారు, బైక్

బైక్‌కి ఖమ్మం జిల్లాకు చెందిన రిజిస్ట్రేషన్ నెంబరే ఉన్నప్పటికీ దాని ఓనర్ మాత్రం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బైక్ కూడా అక్కడే ఉంది. మరి హైదరాబాద్‌లో ఉన్న బైక్‌కి ఖమ్మంలో ఎలా ఫైన్ వేశారని పోలీసులను ప్రశ్నించాడు

  కొత్త ట్రాఫిక్ రూల్స్ చూసి వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. వేలకు వేలు చలాన్లు పడుతుండడంతో కొందరైతే ఏకంగా వాహనాలనే వదులుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొత్త చట్టం అమల్లోకి రాలేదు. దాంతో కాస్త రిలాక్స్‌గా ఫీలవుతున్నారు జనాలు. ఐతే ఈ-చలాన్ల విషయంలో మాత్రం తెలంగాణ పోలీసులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక వాహనానికి విధించాల్సిన చలాన్‌ను మరో వాహనానికి విధిస్తూ తప్పులో కాలేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ బైక్‌కి తప్పుడు చలాన్ వేసి షాకిచ్చారు.

  ఆగస్టు 28 ఖమ్మం బైపాస్ రోడ్డులో ఓ కారు (TS04EW4159) ఓవర్ స్పీడ్‌తో వెళ్లింది. ఐతే నెంబర్ విషయంలో పొరబడిన ట్రాఫిక్ పోలీసులు కారుకు కాకుండా ఓ బైక్‌కు చలానా వేశారు. కారు రిజిస్ట్రేషన్ నెంబరు TS04EW4159 ఐతే.. పోలీసులు TS04EW4259కి చలాన్ వేశారు. నెంబరులో 1 కి బదులు 2గా పేర్కొనడంతో కారుకు పడాల్సిన చలాన్.. బైెక్‌కి పడింది. బైక్‌కి ఖమ్మం జిల్లాకు చెందిన రిజిస్ట్రేషన్ నెంబరే ఉన్నప్పటికీ దాని ఓనర్ మాత్రం హైదరాబాద్‌లో ఉంటున్నాడు.  బైక్ కూడా అక్కడే ఉంది. మరి హైదరాబాద్‌లో ఉన్న బైక్‌కి ఖమ్మంలో ఎలా ఫైన్ వేశారని పోలీసులను ప్రశ్నించాడు. దీనిపై ఆరా తీసిన పోలీసులు నెంబర్ విషయంలో పొరపాటు జరిగిందని వెల్లడించారు. అనంతరం బైక్‌పై చలాన్ రద్దుచేసి..ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన కారుకు చలాన్ విధించారు.

  ట్రాఫిక్ చలాన్
  First published:

  Tags: Hyderabad, Traffic, TRAFFIC AWARENESS, Traffic challans, Traffic rules

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు